జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తీవ్ర విషాదం.. తల్లి, కూతురు పురుగుల మందు తాగి ఆత్మహత్య

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో పురుగుల మందు తల్లీకూతురు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు.

జయశంకర్ భూపాలపల్లి  జిల్లాలో తీవ్ర విషాదం.. తల్లి, కూతురు పురుగుల మందు తాగి  ఆత్మహత్య

Edited By:

Updated on: Dec 21, 2020 | 4:21 PM

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో పురుగుల మందు తల్లీకూతురు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన మహదేవపూర్ మండలం కన్నెపల్లిలో చోటు చేసుకుంది. తల్లి వేమునూరి సమత(35), కూతురు అశ్విని(13)గా స్థానికులు గుర్తించారు. అయితే వారి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం మహదేవపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.