చైనాలో మరో కొత్త వైరస్.. 6,620 మందికి బ్రూసెల్లోసిస్ పాజిటివ్

|

Nov 06, 2020 | 5:48 PM

ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడిన కోట్లాది మంది నానావస్థతలు పడుతున్నారు. దాదాపు లక్షలాది వైరస్ కాటుకు బలయ్యారు. తాజాగా మరో వైరస్ పొంచి ఉందని చైనా అధికారులు వెల్లడించారు.

చైనాలో మరో కొత్త వైరస్.. 6,620 మందికి బ్రూసెల్లోసిస్ పాజిటివ్
Follow us on

ప్రపంచానికి మాయదారి రోగాన్ని అంటగట్టిన డ్రాగన్ కంట్రీ.. మరో మహమ్మారిని పరిచయం చేసేందుకు సిద్ధమవుతున్నది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడిన కోట్లాది మంది నానావస్థతలు పడుతున్నారు. దాదాపు లక్షలాది వైరస్ కాటుకు బలయ్యారు. తాజాగా మరో వైరస్ పొంచి ఉందని చైనా అధికారులు వెల్లడించారు.

చైనాలోని వూహాన్ నగరంలో కరోనా వైరస్ వ్యాప్తి తర్వాత మరో ఇన్ఫెక్షన్ వెలుగుచూసింది. ఆ దేశంలోని గన్సు ప్రావిన్సు లాన్ జౌలో 6 వేల మందికి బ్రూసెల్లోసిస్ అనే బ్యాక్టీరియా పాజిటివ్ అని తేలిందని చైనా అధికారులు వెల్లడించారు. లాన్ జౌలో గత కొద్దిరోజులుగా అనారోగ్యానికి గురైన 55,725 మందిని పరీక్షించగా, వారిలో 6,620 మందికి బ్రూసెల్లోసిస్ కు పాజిటివ్ అని తేలిందని చైనా ప్రభుత్వ అధికారులు ప్రకటించారు. గన్స్ ప్రావిన్సులోని లాన్ జౌ నగరంలో పశువుల ద్వారా ఈ వైరస్ వ్యాపించి బ్రూసెల్లోసిస్ వ్యాధి ప్రబలుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు దీని బారినపడినవారి సంఖ్య 6,620 మందికి చేరుకుందని అధికారులు ధ్రువీకరించారు. జంతువులతో ప్రత్యక్ష సంబంధం వల్ల, కలుషితమైన జంతుఉత్పత్తులను తినడం వల్ల మనుషులకు ఫ్లూ లాంటి లక్షణాలతో కూడిన బ్రూసెలోసిస్ వస్తుందని ప్రపంచ ఆరోగ్యసంస్థ వెల్లడించింది. చైనాలోని పశుసంవర్ధకశాఖ యాజమాన్యంలోని బయోఫార్మాస్యుటికల్ ఫ్యాక్టరీలో ఈ వైరస్ వ్యాప్తి చెందిందని లాన్ జౌ ఆరోగ్య కమిషన్ వెల్లడించింది. దీంతో స్థానిక ప్రజలను చైనా అధికారులు అప్రమత్తం చేశారు. ఇది ఇతరులకు వ్యాపించడానికి గల కారణాలపై పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు.