ఇండోనేషియాలో కరోనా కంటే 10 రెట్లు ప్రమాదకర వైరస్

|

Aug 30, 2020 | 7:46 PM

కరోనాతోనే జనం కంపించిపోతుంటే. దానికి పది రెట్లు ప్రమాదకరమైన మరో వైరస్ ఇండోనేషియాలోనూ బయటపడింది. ఇటీవల ఇది మలేసియాలో వెలుగుచూసింది. D614G వైరస్ గా ఉదహరించే ఈ వైరస్..

ఇండోనేషియాలో కరోనా కంటే 10 రెట్లు ప్రమాదకర వైరస్
Follow us on

కరోనాతోనే జనం కంపించిపోతుంటే. దానికి పది రెట్లు ప్రమాదకరమైన మరో వైరస్ ఇండోనేషియాలోనూ బయటపడింది. ఇటీవల ఇది మలేసియాలో వెలుగుచూసింది. D614G వైరస్ గా ఉదహరించే ఈ వైరస్ ఇండోనేషియాలో వైరస్ వ్యాప్తికి కారణమని భావిస్తున్నారు. ఈ వైరస్‌కు అత్యంత వేగంతో వ్యాప్తించే గుణం ఉందట. ఇప్పటివరకూ ప్రపంచంలో ఈ కొవిడ్ వైరస్ జన్యు ఉత్పరివర్తనం ఒక క్లస్టర్‌లోని 45 కేసుల్లో కనీసం మూడు కేసులలో గుర్తించారు. తాజాగా ఫిలిప్పీన్స్ నుంచి తిరిగొచ్చిన వ్యక్తులతో కూడిన క్లస్టర్‌లో ఈ కొత్త రకం వైరస్‌ను గుర్తించినట్టు మలేసియా శాస్త్రవేత్తలు తెలిపారు. ఇంకా.. భారత్ నుంచి తిరిగొచ్చిన ఓ రెస్టారెంట్ యజమానిలోనూ ఈ తరహా వైరస్ గుర్తించామన్నారు.

ఇప్పుడు ఈ వైరస్‌ను ఇండోనేషియాలో గుర్తించినట్లు జకర్తాలోని ఐజాక్‌మాన్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ మాలిక్యూలర్‌ బయాలజీ వెల్లడించింది. ఇండోనేషియాలో తాజాగా బయటపడ్డ D614G వైరస్‌ ఇప్పటికే తీవ్రంగా వ్యాప్తి చెంది ఉంటుందని భావిస్తున్నారు. కాగా, ఈ వైరస్‌ను‌ ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)ఫిబ్రవరి నెలలోనే గుర్తించింది. దీని మ్యుటేషన్ ఐరోపా, అమెరికాలో వైవిధ్యంగా ఉందని.. ఈ జాతి మరింత తీవ్రమైన వ్యాధికి దారితీస్తుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది.