జూన్ 7న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు

| Edited By:

Jun 04, 2019 | 8:06 PM

నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని జూన్ 7వ తేదీన తాకనున్నాయని భారతీయ వాతావరణ విభాగం (ఐఎండీ) స్పష్టం చేసింది. ఫలితంగా దేశమంతటా రుతుపవనాల గమనం ఆలస్యం అవుతుందని స్పష్టం చేసింది. సాధారణంగా రుతుపవనాలు జూన్ 1వ తేదీకి నాలుగు రోజులు అటు ఇటుగా వస్తాయి. రుతుపవనాలు ఆలస్యంగా రావడం అసాధారణమేమీ కాదని, ప్రస్తుతం కురుస్తున్న వానలతో దక్షిణాదిన వాతావరణం చల్లబడుతుందని.. ఉత్తరాదిన మాత్రం వడగాలుల ప్రభావం తీవ్రంగానే ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. రెండో దశ నివేదిక ప్రకారం.. […]

జూన్ 7న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు
Follow us on

నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని జూన్ 7వ తేదీన తాకనున్నాయని భారతీయ వాతావరణ విభాగం (ఐఎండీ) స్పష్టం చేసింది. ఫలితంగా దేశమంతటా రుతుపవనాల గమనం ఆలస్యం అవుతుందని స్పష్టం చేసింది. సాధారణంగా రుతుపవనాలు జూన్ 1వ తేదీకి నాలుగు రోజులు అటు ఇటుగా వస్తాయి. రుతుపవనాలు ఆలస్యంగా రావడం అసాధారణమేమీ కాదని, ప్రస్తుతం కురుస్తున్న వానలతో దక్షిణాదిన వాతావరణం చల్లబడుతుందని.. ఉత్తరాదిన మాత్రం వడగాలుల ప్రభావం తీవ్రంగానే ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

రెండో దశ నివేదిక ప్రకారం.. వాయవ్య భారతంలో 94శాతం, మధ్యభారతంలో 100శాతం, దక్షిణాదిలో 97శాతం, తూర్పు భారతంలో 91శాతం వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ పేర్కొంది. ఖరీఫ్‌కు కీలకమైన జులై, ఆగస్టు నెలల్లో వర్షాలు బాగా కురుస్తాయని వెల్లడించింది. ఫసిఫిక్ మహాసముద్రంలో ప్రస్తుతం ఎల్‌నినో పరిస్థితులు నెలకొన్నాయి. నైరుతి ముగిసేవరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని తెలుస్తోంది.