గుడ్ న్యూస్.. జూన్ 1కే కేరళకు నైరుతి రుతుపవనాలు: ఐఎండీ

ఓవైపు కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. మరోవైపు ఎండలు మండిపోతున్నాయి. ఈ క్రమంలో ఐఎండీ చల్లని కబురు తెచ్చింది. జూన్ 1 నాటికే దేశంలోకి

గుడ్ న్యూస్.. జూన్ 1కే కేరళకు నైరుతి రుతుపవనాలు: ఐఎండీ

Updated on: May 28, 2020 | 5:23 PM

Southwest Monsoon: ఓవైపు కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. మరోవైపు ఎండలు మండిపోతున్నాయి. ఈ క్రమంలో ఐఎండీ చల్లని కబురు తెచ్చింది. జూన్ 1 నాటికే దేశంలోకి నైరుతి రుతుపవనాలు(సౌత్‌వెస్ట్ మాన్‌సూన్) ప్రవేశించే అనుకూల వాతావరణం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. మే 31 న ఆగ్నేయ, పక్కనే ఉన్న తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీని వల్ల రుతుపవనాలు సకాలంలో ప్రవేశించే అవకాశం ఉందన్నారు.

కాగా.. సౌత్‌వెస్ట్ మాన్‌సూన్ ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయని ఐఎండీ పేర్కొంది. అలాగే, గురువారం నాటికి మాల్దీవులు-కమోరిన్ ప్రాంతం, సహా మిగతా అండమాన్ దీవుల్లోకి విస్తరించినట్టు పేర్కొంది. వచ్చే 48 గంటల్లో మాల్దీవులు-కమోరిన్ ప్రాంతంలోని మిగతా చోట్లలో ముందుకు వెళ్తాయని అంచనా వేస్తున్నారు.

మరోవైపు.. మే 31 నుంచి జూన్ 4 మధ్య.. పశ్చిమ మధ్య అరేబియా సముద్రంపై అల్పపీడన ప్రాంతం ఏర్పడనుంది. దీనికి అనుబంధంగా తుఫాను ఆవర్తనం ట్రోపోస్పియర్ స్థాయి వరకు విస్తరించింది. రాబోయే 48 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం బలపడే అవకాశం ఉంది. వచ్చే 72 గంటల్లో ఇది వాయువ్య దిశగా దక్షిణ ఒమన్, తూర్పు యెమెన్ తీరం వైపు కదిలే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

ఐఎండీ ఆరేబియా సముద్రంలో రెండు అల్పపీడనాలు ఏర్పడుతున్నట్టు ఓ ప్రకటన చేసింది. దీంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమయింది. ఈ సమయంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని, ఒకవేళ ఎవరైనా వెళితే గురువారం రాత్రిలోగా వెనక్కు వచ్చేయాలని పేర్కొంది. కేరళ తీరానికి చేరుకోలేకపోయిన వారు దగ్గరలోని తీర ప్రాంతాలకు వీలైనంత తొందరగా చేరాలని తెలిపింది.

Loading...
Unable to load recommendations.
Follow Us