AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Big Boss 4: మోనాల్‌ కొత్త సినిమా పాట చూశారా.. చీర కట్టులో, డీ గ్లామర్‌ పాత్రలో ఆకట్టుకుంటోన్న బ్యూటీ..

Monal New Movie Song: 'సుడిగాడు' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి మోనాల్‌ గజ్జర్‌ తొలి చిత్రంతోనే తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా...

Big Boss 4: మోనాల్‌ కొత్త సినిమా పాట చూశారా.. చీర కట్టులో, డీ గ్లామర్‌ పాత్రలో ఆకట్టుకుంటోన్న బ్యూటీ..
Narender Vaitla
|

Updated on: Jan 05, 2021 | 2:26 PM

Share

Monal New Movie Song: ‘సుడిగాడు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి మోనాల్‌ గజ్జర్‌ తొలి చిత్రంతోనే తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా మంచి విజయాన్నే అందుకున్న మోనాల్‌కు మాత్రం ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాలేవనే చెప్పాలి. ఇక తాజాగా బిగ్‌బాస్‌ రియాలిటీ షో 4వ సీజన్‌లో పాల్గొన్న మోనాల్‌ ఒక్కసారిగా పేరు సంపాదించుకుంది. హౌజ్‌లో తనదైన ఆటతీరుతో ఆకట్టుకున్న ఈ చిన్నది తెలుగు ఇళ్లలో సందడి చేసింది. దీంతో మోనాల్‌కు హౌజ్‌ నుంచి బయటకు వచ్చాక వరుస ఆఫర్లు క్యూకడుతున్నాయి. ఇప్పటికే ‘స్టార్‌ మా’లో ప్రసారమవుతోన్న ఓ డ్యాన్స్‌ షోలో న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న ఈ చిన్నది పలు చిత్రాల్లోనూ నటించేందుకు ఓకే చెప్పింది.

ఇదిలా ఉంటే మోనాల్‌ బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి వెళ్లకముందు ‘కాగజ్‌’ అనే బాలీవుడ్‌ చిత్రంలో నటించింది. ఈ సినిమాను జనవరి 7న విడుదల చేయడానికి చిత్రయూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ చిత్రంలోని ‘బైల్‌గాడి’ అనే పాటను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఎక్కువగా గ్లామర్‌ పాత్రల్లోనే నటించిన మోనాల్‌.. ఈ పాటలో చీర కట్టులో, డీ గ్లామర్‌ పాత్రలో కనిపించి ఆకట్టుకుంటోంది. ఒక సాధారణ పేదింటి మహిళలగా మోనాల్‌ పలికించిన హావభావాలకు ఫిదా అవుతున్నారు. ఈ సినిమా కథ విషయానికొస్తే.. బతికుండగానే చనిపోయినట్టు సర్టిఫికెట్‌ ఇచ్చిన లంచగొండి ప్రభుత్వ వ్యవస్థల మీద సామాన్యుడి పోరాటానికి దశృరూపం. అజంఘర్‌కు చెందిన భరత్‌ లాల్‌ బిహారీ అనే రైతు జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మరి మోనాల్‌ ఈ సినిమాతో ఎలాంటి ఫేమ్‌ సంపాదించుకుంటుందో చూడాలి.

Also Read: Acharya Movie : ‘ఆచార్య’కోసం అడవులకు చిరు-చరణ్.. మారేడుమిల్లిలో మెగా హీరోల సందడి..

Follow Us
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!