అనంతపురం నడిబొడ్డున దారుణ హత్య

అనంతపురంలో నగర నడిబొడ్డున జరిగిన దారుణ హత్య స్థానికులను కలవరపాటుకు గురిచేసింది. రామ్ నగర్ 80 ఫీట్ రోడ్ లో మహమ్మద్ రఫీ అనే వ్యక్తిని తెల్లవారుజామున 5 గంటల సమయంలో గోపి అనే వ్యక్తి గొంతు కోసి దారుణంగా హతమార్చాడు. మహమ్మద్ రఫీ గతంలో ఫోటోగ్రాఫర్ గా పని చేసేవాడు. ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజామున 80 ఫీట్ రోడ్ లో మహమ్మద్ రఫీ ఉండగా.. గోపి అనే ఆటోడ్రైవర్ అక్కడికి చేరుకొని తన వెంట […]

అనంతపురం నడిబొడ్డున దారుణ హత్య

Updated on: Sep 27, 2020 | 1:28 PM

అనంతపురంలో నగర నడిబొడ్డున జరిగిన దారుణ హత్య స్థానికులను కలవరపాటుకు గురిచేసింది. రామ్ నగర్ 80 ఫీట్ రోడ్ లో మహమ్మద్ రఫీ అనే వ్యక్తిని తెల్లవారుజామున 5 గంటల సమయంలో గోపి అనే వ్యక్తి గొంతు కోసి దారుణంగా హతమార్చాడు. మహమ్మద్ రఫీ గతంలో ఫోటోగ్రాఫర్ గా పని చేసేవాడు. ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజామున 80 ఫీట్ రోడ్ లో మహమ్మద్ రఫీ ఉండగా.. గోపి అనే ఆటోడ్రైవర్ అక్కడికి చేరుకొని తన వెంట తెచ్చుకున్న కత్తితో దారుణంగా గొంతు కోసి హతమార్చాడు.

రక్తపుమడుగులో కుప్పకూలిపోయిన రఫీ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని బోరున విలపించారు. డిఎస్పీ వీర రాఘవ రెడ్డి, ఇతర పోలీసు బృందాలు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. గోపి నే హత్య చేసినట్టు ప్రాథమికంగా తెలుసుకున్నారు. అక్రమ సంబంధం నేపథ్యంలోనే హత్య జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us