అద్దె ఇళ్లల్లో ఉండేవారికి కేంద్రం శుభవార్త

అద్దె ఇళ్లల్లో ఉండేవారికి శుభవార్త. త్వరలో కొత్తగా నమూనా అద్దె చట్టాన్ని తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఖాళీగా ఉండే ఇళ్లను అద్దెకు ఇస్తూ రెంటల్‌ హౌజింగ్‌ సెక్టార్‌ను ప్రోత్సహించడంలో భాగంగా తీసుకొచ్చిన నమూనా అద్దె చట్టానికి వచ్చే నెలలో కేంద్రం ఆమోదించనుందని కేంద్ర గృహ, పట్టణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి దుర్గా శంకర్‌ మిశ్రా తెలిపారు.

అద్దె ఇళ్లల్లో ఉండేవారికి కేంద్రం శుభవార్త

Updated on: Aug 27, 2020 | 10:54 AM

అద్దె ఇళ్లల్లో ఉండేవారికి శుభవార్త. త్వరలో కొత్తగా నమూనా అద్దె చట్టాన్ని తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఖాళీగా ఉండే ఇళ్లను అద్దెకు ఇస్తూ రెంటల్‌ హౌజింగ్‌ సెక్టార్‌ను ప్రోత్సహించడంలో భాగంగా తీసుకొచ్చిన నమూనా అద్దె చట్టానికి వచ్చే నెలలో కేంద్రం ఆమోదించనుందని కేంద్ర గృహ, పట్టణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి దుర్గా శంకర్‌ మిశ్రా తెలిపారు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ కొత్త చట్టాన్ని అమలు చేయాలని సూచించారు. గృహరంగంపై అసోచామ్‌ బుధవారం నిర్వహించిన వెబినార్‌లో ఆయన పాల్గొన్నారు.

నమూనా అద్దె చట్టం అమల్లోకి వచ్చాక గృహాలకు సంబంధించిన పలు వివాదాలు పరిష్కారమవుతాయని.. ఖాళీగా ఉన్న 60 నుంచి 80 శాతం ఇండ్లు రెంటల్‌ మార్కెట్లోకి వస్తాయన్నారు మిశ్రా. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు అమ్ముడుపోని నిర్మాణాలను అద్దె గృహాలుగా మార్చుకునే అవకాశం లభిస్తుందన్నారు. 2019లో ఈ చట్టాన్ని కేంద్రం ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ చట్టం ప్రకారం.. యజమాని, అద్దెదారుడికి మధ్య తలెత్తే వివాదాలను జిల్లా కలెక్టర్‌ సమక్షంలో పరిష్కరించుకునేందుకు వీలవుతుంది. ఇంటి అద్దె పెంచాలనుకుంటే.. యజమాని మూడు నెలల ముందు దాని గురించి నోటీసును ఇవ్వడం వంటి అంశాలను ఈ చట్టంలో చేర్చుతున్నట్లు మిశ్రా తెలిపారు. దీంతో యాజమానుల నుంచి అద్దెదారులకు వేధింపులు తగ్గనున్నాయి.