
తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సమరం కొనసాగుతోంది. ఉమ్మడి వరంగల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్సీ స్థానాల కోసం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.