GHMC Election Result 2020 : వందకుపైగా స్థానాల్లో టీఆర్ఎస్ ఘనవిజయం సాధిస్తుంది : కవిత

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించిన ఓట్ల లెక్కింపు  కొనసాగుతుంది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపును చేపట్టారు. అవి ముగిసిన వెంటనే మిగిలిన ఓట్లను లెక్కిస్తారు.

GHMC Election Result 2020 : వందకుపైగా స్థానాల్లో టీఆర్ఎస్ ఘనవిజయం సాధిస్తుంది : కవిత

Updated on: Dec 04, 2020 | 11:05 AM

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించిన ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపును చేపట్టారు. అవి ముగిసిన వెంటనే మిగిలిన ఓట్లను లెక్కిస్తారు. సాయంత్రానికి ఎన్నికల ఫలితాలు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్  ఘనవిజయం సాదిస్తుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ నాయకత్వంలో, మంత్రి కేటీఆర్ పనితీరుతో ప్రజలు అత్యధిక మెజారిటీతో టీఆర్ఎస్‌ను గెలిపిస్తారనే విశ్వాసం తమకు ఉందని ఆమె అన్నారు. నిన్న వచ్చిన ఎగ్జిట్ పోల్స్ కూడా టీఆర్ఎస్‌కు అనుకూలంగానే వచ్చాయన్నారు. వందకుపైగా స్థానాలు టీఆర్ఎస్ ఘనవిజయం సాదిస్తుందని కవిత ధీమా వ్యక్తం చేశారు.