మాన‌వ‌త్వం చాటుకున్న ప్ర‌భుత్వ విప్ ఉద‌య‌భాను..

జ‌గ్గ‌య్య‌పేట శాస‌న‌స‌భ్య‌లు, ప్రభుత్వ విప్ ఉద‌య‌భాను మాన‌వ‌త్వం చాటుకున్నారు. ఈ రోజు విజ‌య‌వాడ‌-హైద‌రాబాద్ హైవేపై కంచ‌క‌చ‌ర్ల వ‌ద్ద ద్విచ‌క్ర వాహ‌నంపై వెళ్తోన్న ఓ వ్య‌క్తి డివైడ‌ర్ ఢీ కొట్టి తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

మాన‌వ‌త్వం చాటుకున్న ప్ర‌భుత్వ విప్ ఉద‌య‌భాను..

Updated on: Jun 12, 2020 | 9:00 PM

జ‌గ్గ‌య్య‌పేట శాస‌న‌స‌భ్య‌లు, ప్రభుత్వ విప్ ఉద‌య‌భాను మాన‌వ‌త్వం చాటుకున్నారు. ఈ రోజు విజ‌య‌వాడ‌-హైద‌రాబాద్ హైవేపై కంచ‌క‌చ‌ర్ల వ‌ద్ద ద్విచ‌క్ర వాహ‌నంపై వెళ్తోన్న ఓ వ్య‌క్తి ..మ‌రో వాహ‌నాన్ని ఢీ కొట్టి తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఆ స‌మ‌యంలో అటుగా వెళ్తోన్న ప్ర‌భుత్వ విప్ ఉద‌య‌భాను త‌న‌ కారు ఆపి క్ష‌త‌గాత్రుడిని ప‌రామర్శించారు. స్వ‌యంగా అంబులెన్స్ కు ఫోన్ చేసి…అది వ‌చ్చేవ‌రకు వెయిట్ చేసి అత‌డిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఎమ్మెల్యే మంచి మ‌న‌సును చాటుకుని ప‌లువురికి ఆదర్శంగా నిలిచార‌ని అక్క‌డ ఉన్న స్థానికులు కొనియాడారు.