రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, అతని అనుచరులపై పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన విషయం విదితమే. ఇంటికి వెళ్లిన పోలీసులు.. రాపాక లేకపోవడంతో వెనుదిరిగారు. రాత్రినుంచి ఆయన కోసం గాలిస్తున్నారు. అయితే.. ఎమ్మెల్యే రాపాకనే పోలీసులకు లొంగిపోనున్నట్టు సమాచారం. రెండు రోజుల క్రితం తన అనుచరులతో కలిసి రాపాక మల్కీపురం పీఎస్‌పై దాడి చేశారు. అద్దాలు పగుల కొట్టి, ప్రభుత్వ ఆస్తులను నాశం చేసి, నానా బీభత్సం సృష్టించారు. అంతే కాకుండా ఈ ఘటనలో స్టేషన్‌పై ఎమ్మెల్యే అనుచరులు రాళ్లు రువ్వారు. ఈ దాడి కేసులో.. పోలీసులు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సహా అతని అనుచరులపై కేసు నమోదు చేశారు. ఏ1గా రాపాక వరప్రసాద్ పేరునే చేర్చడంతో.. ఆయను లొంగిపోవాలని పోలీసులు సూచించారు. అయితే.. తాను ఇక్కడ లేనని.. నేనే వెళ్లి పోలీసులకు లొంగిపోతానని ఎమ్మెల్యే రాపాక తెలిపారు.