వరంగల్ ఉమ్మడి జిల్లాలో ప్రేమికుల వరుస ఆత్మహత్యలు కలవరపరుస్తున్నాయి. తాజాగా జనగాం జిల్లాలో మరో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. పాలకుర్తి మండల కేంద్రంలోని ఎర్రమల్లెలు కుంట సమీపంలో నివాసముంటున్న ప్రేమికులిద్దరూ పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే, వీరిద్దరూ మైనర్లే కావడం మరింత ఆందోళనకు గురిచేసే అంశం. అమ్మాయి లక్ష్మీ వయసు 17 కాగా, అబ్బాయి అంజయ్య.. వయస్సు 18 సంవత్సరాలు. ఇలాఉండగా, నిన్న వరంగల్ అర్బన్ జిల్లాలో ఒక ప్రేమజంట సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే.