మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన ఇసుక కార్పొరేషన్‌పై విజయవాడలో మంత్రుల కమిటీ సమావేశం జరిగింది. మంత్రులు పేర్నినాని, కొడాలి నాని, గనులశాఖ ముఖ్య కార్యదర్శి హాజరయ్యారు. ఇసుక కార్పొరేషన్ విధి విధానాలపై మంత్రుల కమిటీ చర్చించింది. టెక్నాలజీ వినియోగించి ఇసుక లభ్యతను గుర్తించడం ద్వారా కొత్త రీచ్‌లకు అనుమతులు ఇవ్వాలని అభిప్రాయానికి వచ్చారు. కొత్త రీచ్‌లకు పర్యావరణ నియంత్రణ మండలి అనుమతులు వేగంగా తీసుకోవాలని కమిటీ నిర్ణయించింది.