డ‌బుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్

|

Nov 04, 2020 | 9:27 PM

పేదల ఆత్మగౌర‌వ లోగిళ్లు.. డ‌బుల్ బెడ్రూం ఇండ్లు అని, అభివృద్ధి-ప్రజా సంక్షేమం ప్రభుత్వానికి రెండు కండ్లు అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం నియోజకవర్గం వీవీపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన డ‌బుల్ బెడ్రూం ఇండ్లను...

డ‌బుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్
Follow us on

Double Bedroom Houses : పేదల ఆత్మగౌర‌వ లోగిళ్లు.. డ‌బుల్ బెడ్రూం ఇండ్లు అని, అభివృద్ధి-ప్రజా సంక్షేమం ప్రభుత్వానికి రెండు కండ్లు అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం నియోజకవర్గం వీవీపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన డ‌బుల్ బెడ్రూం ఇండ్లను ఆయన ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ‌త ప్రభుత్వాలు పేదలకు త‌క్కువ వ్యయంతో అర‌కొర వ‌స‌తుల‌తో ఇండ్లను నిర్మించి ఇచ్చిందని.. కానీ తెలంగాణ‌ ప్రభుత్వం వారి ఆత్మగౌరవం నిలిపేలా డ‌బుల్ బెడ్రూం ఇండ్ల నిర్మించి ఇస్తున్నాదని అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం పేదల ప‌క్షపాతి అని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ రూపొందించిన సంక్షేమ ప‌థ‌కాలు దేశానికే ఆద‌ర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. భూవివాదాలను పరిష్కరించేందుకే ప్రభుత్వం కొత్త రెవెన్యూ చ‌ట్టాన్ని తెచ్చిందని గుర్తు చేశారు.