దుబ్బాక ఓటమికి బాధ్యత వహిస్తున్నాః హరీష్ రావు

|

Nov 10, 2020 | 5:43 PM

ప్రజాతీర్పును శిరసావహిస్తానని రాష్ట్ర మంత్రి హరీష్ రావు తెలిపారు. ఉప ఎన్నిక ఓటమికి బాధ్యత వహిస్తున్నానని హరీష్ రావు ప్రకటించారు.

దుబ్బాక ఓటమికి బాధ్యత వహిస్తున్నాః హరీష్ రావు
Follow us on

ప్రజాతీర్పును శిరసావహిస్తానని రాష్ట్ర మంత్రి హరీష్ రావు తెలిపారు. ఉప ఎన్నిక ఓటమికి బాధ్యత వహిస్తున్నానని హరీష్ రావు ప్రకటించారు. దుబ్బాక ఉప ఎన్నిక అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి హరీష్ రావు.. టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ప్రజలతోనే ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి కి, ప్రజలకు, కార్యకర్తలకు, అన్నివిధాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఓటమిపాలైనప్పటికీ దుబ్బాక ప్రజల పక్షాన కష్ట సుఖాల్లో టీఆర్ఎస్ పార్టీ ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.

టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసిన దుబ్బాక ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన హరీష్.. ఎన్నికల్లో కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపారు. దుబ్బాక ఓటమికి గల కారణాలపై పూర్తి స్థాయిలో సమీక్షించుకుంటామన్నారు. పార్టీ అంతర్గత లోపాలను సవరించు కుంటూ.. దుబ్బాకలో ప్రజా సేవలో నిరంతరం పాటు పడుతూ ఎప్పుడు అందుబాటులో ఉంటామన్నారు.