మంత్రి గంగుల ఎస్కార్ట్ వాహనం బోల్తా..

కరీంనగర్‌ జిల్లాలో మినిస్ట‌ర్ గంగుల కమలాకర్‌ కాన్వాయ్ లో ఓ వాహ‌నం ప్ర‌మాదానికి గురైంది. మంత్రి వాహనం వెనుక ఉండే ఎస్కార్ట్ వెహిక‌ల్ ప్ర‌మాద‌వ‌శాత్తూ బోల్తా పడింది.

మంత్రి గంగుల ఎస్కార్ట్ వాహనం బోల్తా..

Edited By:

Updated on: Jul 11, 2020 | 7:11 PM

కరీంనగర్‌ జిల్లాలో మినిస్ట‌ర్ గంగుల కమలాకర్‌ కాన్వాయ్ లో ఓ వాహ‌నం ప్ర‌మాదానికి గురైంది. మంత్రి వాహనం వెనుక ఉండే ఎస్కార్ట్ వెహిక‌ల్ ప్ర‌మాద‌వ‌శాత్తూ బోల్తా పడింది. ఈ ఘటనలో కొత్తపల్లి ఎస్సైకి తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. కరీంనగర్‌లోని ఆర్టీసీ వర్క్‌షాప్‌ వద్ద ఈ యాక్సిండెంట్ జరిగింది. అదుపుతప్పి వాహ‌నం బోల్తా పడటంలో అందులో ఉన్న ఎస్సై ఎల్లాగౌడ్‌ చేతి బొటనవేలు తెగిపోయింది. అతడిని వెంటనే ద‌గ్గ‌ర్లోని ఆస్ప‌త్రికి త‌రలించారు.

మరోవైపు, ప‌లువురు మంత్రులు శనివారం కరీంనగర్ జిల్లాలో సుడిగాలి పర్యటనలు చేశారు. పార్టీ లోక‌ల్ లీడ‌ర్స్, అధికారులను వెంట బెట్టుకుని పలు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శంకుస్థాపనలు చేశారు. సిటీలోని చింతకుంట వద్ద మొక్కజొన్న వ్యవసాయ పరిశోధనా కేంద్రం కొత్త భవనాన్ని, బీసీ సంక్షేమ మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి మరో మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు.