ఏపీ పర్యాటక శాఖపై మంత్రి కీలక కామెంట్స్..

|

Jul 14, 2020 | 10:10 PM

AP Tourism: ఏపీలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేపడుతోంది. ఇందులో భాగంగానే తాజాగా పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ సమీక్ష నిర్వహించారు. పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్‌షిప్‌లతో ఏడు పర్యాటక ప్రాంతాల్లో ఫైవ్ స్టార్, సెవెన్ స్టార్ హోటళ్లు పెట్టాలనుకుంటున్నామన్నారు. కరోనా వైరస్ కారణంగా పర్యాటక శాఖ నెలకు 10 కోట్ల చొప్పున మొత్తంగా 60 కోట్లు నష్టపోయిందని తెలిపారు. కోవిడ్ 19 నిబంధనలను పాటిస్తూ కల్చరల్ డిపార్ట్‌మెంట్‌ నుంచి ప్రముఖుల […]

ఏపీ పర్యాటక శాఖపై మంత్రి కీలక కామెంట్స్..
Follow us on

AP Tourism: ఏపీలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేపడుతోంది. ఇందులో భాగంగానే తాజాగా పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ సమీక్ష నిర్వహించారు. పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్‌షిప్‌లతో ఏడు పర్యాటక ప్రాంతాల్లో ఫైవ్ స్టార్, సెవెన్ స్టార్ హోటళ్లు పెట్టాలనుకుంటున్నామన్నారు. కరోనా వైరస్ కారణంగా పర్యాటక శాఖ నెలకు 10 కోట్ల చొప్పున మొత్తంగా 60 కోట్లు నష్టపోయిందని తెలిపారు. కోవిడ్ 19 నిబంధనలను పాటిస్తూ కల్చరల్ డిపార్ట్‌మెంట్‌ నుంచి ప్రముఖుల జయంతి, వర్ధంతులను 50 మందితో నిర్వహిస్తామన్నారు. అన్ని జిల్లాల్లోని అన్ని పర్యాటక ప్రాంతాలూ ప్రారంభిస్తామన్నారు.

దేశంలోనే ఏపీని నెంబర్ వన్‌గా ఉంచేందుకు, అన్ని వర్గాలు సంతోషంగా ఉండాలని సీఎం జగన్ ఎన్నో సంక్షేమ పధకాలను అమలు చేస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. చంద్రబాబు కొన్ని వర్గాలకు మాత్రమే మేలు చేశారని.. కానీ జగన్ సర్కార్ అన్ని వర్గాల ప్రభుత్వమని ఆయన అన్నారు. వివక్ష, అవినీతి లేకుండా పరిపాలనను సాగిస్తున్నామన్నారు. పదేళ్ల తరువాత మళ్లీ ఏర్పాటు ఉద్యమాలు రాకూడదనే ఉద్దేశంతో జగన్ మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనుకుంటున్నారన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల వారితోనే‌ శభాష్ అనే విధంగా జగన్మోహన్ రెడ్డి పాలన ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. కాగా, విశాఖపట్నంలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదం దురదృష్టకరమని మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న పరిశ్రమలు భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని వెల్లడించారు.

ఇది చదవండి: పురాతన విగ్రహాన్ని స్కాన్ చేస్తూ ఖంగుతిన్న అధికారులు.. లోపల ఏం ఉందంటే.?