
గాలి జనార్ధన్ రెడ్డి.. ఈ పేరు వినగానే ముందు గుర్తొచ్చేది. మైనింగ్ మాఫియా, సీబీఐ కేసులు, విలాసాలు, రాజభోగాలు.. ఇలా రాజకీయాల్లో వాడివేడిగా ఉన్న మైనింగ్ కింగ్ ప్రస్తుతం తనకు పిల్లనిచ్చిన మామగారి స్వగ్రామమైన కర్నూలు జిల్లాలో సేద తీరుతున్నారు.
ఈ సందర్భంగా ఆయన తన మామగారికి చెందిన మామిడితోటలో భార్యతో సరదాగా గడిపారు. భార్య కోసం మామిడి చెట్టు ఎక్కి మామిడికాయలు కోశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక దీనిని స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం విశేషం. 27 ఏళ్ళ క్రితం ఈ చెట్టు తానే నాటానని.. ఆ చెట్టు ఎక్కి కాయలు కోసి తన భార్యకు ఇవ్వడం సంతోషంగా ఉందని గాలి చెప్పుకొచ్చాడు.
చెట్లు ఎక్కి మామిడి కాయలను కోసినప్పుడు తన బాల్యం మరోసారి గుర్తుకు వచ్చిందని.. అంతేకాకుండా ఆయన స్నేహితులను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు మైనింగ్ కింగ్.