ఎస్పీబీ తాజా హెల్త్ బులిటెన్ వచ్చేసింది..

| Edited By: Pardhasaradhi Peri

Sep 08, 2020 | 9:28 PM

కరోనాతో పోరాడుతూ చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఎంజీఎం హాస్పిటల్‌ యాజమాన్యం తాజాగా హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది.

ఎస్పీబీ తాజా హెల్త్ బులిటెన్ వచ్చేసింది..
Follow us on

SPB Health : కరోనాతో పోరాడుతూ చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఎంజీఎం హాస్పిటల్‌ యాజమాన్యం తాజాగా హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది. ఎస్పీబీకి వెంటిలేటర్, ఎక్మో సహాయంతో చికిత్స అందిస్తున్నామని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొంది.

“బాలు గారి ఆరోగ్యం నిలకడగా ఉంది. ఎక్మో సాయంతో వెంటిలేటర్​పై చికిత్స పొందుతున్నారు. మెలకువతో ఉండి స్పందిస్తున్నారు.” ఆస్పత్రి వర్గాలు తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో పేర్కొంది. కరోనా కారణంగా ఆస్పత్రిలో చేరిన బాలుకు సోమవారం నెగటివ్​గా నిర్ధరణ అయింది. ఈ విషయాన్ని ఆయన తనయుడు ఎస్పీ చరణ్ వెల్లడించారు. అనారోగ్యం కారణంగా చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

అయితే ఈ రెండు రోజుల్లో బాలు ఆరోగ్యంగా ఇంటికి చేరుకుంటారని అంతా భావించారు. అయితే తాజాగా విడుదలైన హెల్త్ బులిటెన్ ప్రకారం ఆయన మరికొన్ని రోజులు ఆస్పత్రిలోనే ఉండే అవకాశం ఉంది