Acharya Movie: సినిమా కోసం అతి పెద్ద టెంపుల్ సెట్.. ‘ఆచార్య’ సెట్ వీడియో షేర్ చేసిన చిరంజీవి..

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ఆచార్య. ఇందులో కాజల్ హీరోయిన్‏గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని కొణిదేల ప్రొడక్షన్, మ్యాట్నీ

Acharya Movie: సినిమా కోసం అతి పెద్ద టెంపుల్ సెట్.. 'ఆచార్య' సెట్ వీడియో షేర్ చేసిన చిరంజీవి..
Follow us
Rajitha Chanti

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 06, 2021 | 6:44 PM

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ఆచార్య. ఇందులో కాజల్ హీరోయిన్‏గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని కొణిదేల ప్రొడక్షన్, మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్లపై రామ్ చరణ్ మరియు నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రత్యకత ఎంటంటే ఆలయం. దాదాపు 20 ఎకరాల్లో ఓ టెంపుల్ సెట్‏ను నిర్మించారు. ఇక దేశంలో ఒక సినిమా కోసం అన్ని ఎకరాల్లో ఇంత పెద్ద సెట్ వేయడం ఇదే మొదటి సారి అని చిరంజీవి అన్నారు. అంతేకాకుండా ఆ టెంపుల్ సెట్ గురించి తెలియజేస్తూ ఓ వీడియో కూడా తన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు మెగాస్టార్.

“ఆచార్య సినిమా కోసం సినీ ఇండస్ట్రీలో మొదటి సారిగా నిర్మించిన భారీ టెంపుల్ సెట్ ఇది. 20 ఎకరాల విస్తీర్ణంలో వేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా గాలి గోపురం, ఆశ్చర్యంగా ప్రతి చిన్న చిన్న డీటేల్స్‏ని అద్భుతంగా మలిచారు. ఇది కళా దర్శకత్వ ప్రతిభకే ఒక మచ్చుతునక. నాకెంతో ముచ్చటనిపించి, నా కెమెరాలో బంధించి మీతో పంచుకోవాలనుకున్నాను. నిజంగానే ఒక గుడిలో ఉన్నామా అనేంతగా ఈ సెట్‏ని నిర్మించిన కళా దర్శకుడు సురేష్, ఈ టెంపుల్ టౌన్‏ను విజువలైజ్ చేసిన దర్శకుడు కొరటాల శివను, దీన్ని ఇంత అపురూపంగా నిర్మించడానికి కావాల్సిన వనరులను ఇచ్చిన నిర్మాతలు నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్‏లను నేను మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. ప్రేక్షకులకు కూడా ఈ టెంపుల్ టౌన్ ఒక ఆనందానుభూతిని కలిగిస్తుందనడంలో సందేహం లేదు” అని చిరంజీవి చెప్పారు.

ఆచార్య టెంపుల్ సెట్ వీడియో షేర్ చేసిన చిరు..

Also Read:  ఆల్ సెట్, ‘ఆచార్య’ సెట్‌లో అడుగు పెట్టేందుకు ‘అన్నయ్య’ రెడీ