విషాదంలో మెగా హీరోలు.. అందుకే ‘అలవైకుంఠపురం’ టీజర్ వాయిదా..!

మెగా హీరోలకు అత్యంత ఆప్తులైన వారు మరణిస్తే.. వారి విచారానికి అంతుండదు. తమ చిత్రాలనే కాకుండా.. తమను కూడా.. అభిమానించే వారు కన్నుమూస్తే.. ఆత్మీయులను కోల్పోయినంతగా.. బాధ పడుతూంటారు. ఆ కారణంగానే.. బన్నీ హీరోగా వస్తోన్న అల వైకుంఠపురంలో.. సినిమా టీజర్‌ విడుదలను కూడా వాయిదా వేశారు. దీనికి అసలు కారణం ఏంటంటే.. వీరిని ఇష్టపడే.. ఓ అభిమాని మృతి చెందాడు. మెగా కుటుంబానికి అతి సన్నిహితుడైన.. ఓ అభిమాన సంఘం నాయకుడు కన్నుమూయడంతో.. మెగా హీరోలు.. […]

విషాదంలో మెగా హీరోలు.. అందుకే అలవైకుంఠపురం టీజర్ వాయిదా..!

Edited By:

Updated on: Dec 08, 2019 | 2:12 PM

మెగా హీరోలకు అత్యంత ఆప్తులైన వారు మరణిస్తే.. వారి విచారానికి అంతుండదు. తమ చిత్రాలనే కాకుండా.. తమను కూడా.. అభిమానించే వారు కన్నుమూస్తే.. ఆత్మీయులను కోల్పోయినంతగా.. బాధ పడుతూంటారు. ఆ కారణంగానే.. బన్నీ హీరోగా వస్తోన్న అల వైకుంఠపురంలో.. సినిమా టీజర్‌ విడుదలను కూడా వాయిదా వేశారు. దీనికి అసలు కారణం ఏంటంటే.. వీరిని ఇష్టపడే.. ఓ అభిమాని మృతి చెందాడు. మెగా కుటుంబానికి అతి సన్నిహితుడైన.. ఓ అభిమాన సంఘం నాయకుడు కన్నుమూయడంతో.. మెగా హీరోలు.. విషాదంలో మునిగిపోయారు.

స్వయంగా.. మెగాస్టార్ చిరంజీవి.. అభిమాని ఇంటికి వెళ్లి పరామర్శించారు. గ్రేటర్ హైదరాబాద్‌‌ చిరంజీవి యువత సంఘానికి అధ్యక్షుడిగా నూర్ మహమ్మద్ వ్యవహరిస్తున్నాడు. ఇతను చిరంజీవి సినిమాలతో పాటు.. పలు కార్యక్రమాల్లో యాక్టీవ్‌గా వ్యవహరించేవారు. మెగా ఫ్యామిలీకి సంబంధించి ఏ సినిమా రిలీజ్ అయినా.. ఇతను ముందుండేవాడు. అయితే.. కొన్ని రోజులుగా.. నూర్ అనారోగ్యంతో బాధపడుతూ.. ఈ రోజు ఉదయం మరణించాడు. ఇదివరకే.. రాం చరణ్.. నూర్ మహ్మద్‌కి హార్ట్ ఆపరేషన్‌ చేయించారు. అలాగే.. ఆపరేషన్ అనంతరం.. అల్లు అరవింద్ డబ్బు సహాయం కూడా అందించారు. మెగా ఫ్యామిలీలోని.. అందరికీ నూర్ అత్యంత సన్నిహితుడు. చిరంజీవి, పవన్, అల్లు అరవింద్, చెర్రీ, అల్లు అర్జున్‌, సాయి ధరమ్ తేజ్‌లతో ఇతను ఒక ఫ్యామిలీ మెంబర్‌లా వ్యవహరించేవారు.

కాగా.. చిరంజీవి మొదలు కొని.. మెగా హీరోలంతా.. నూర్ మృతికి, అతని కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కారణంగానే అల్లు అర్జున్ తన సినిమా టీజర్ కూడా వాయిదా వేసుకున్నారు. ఫ్యాన్స్‌ అంటే మెగా హీరోలకు ఎంత అభిమానమో.. దీంతో అర్థమయ్యింది.