
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే మీ సేవా కేంద్రాలను మూసివేయనున్నట్లు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుందని సమాచారం. ఏపీలో అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న గ్రామ సచివాలయాల రాకతో ఈ పెనుమార్పులు చోటుచేసుకోనున్నట్టు తెలుస్తోంది. దీంతో ఇప్పటివరకూ ఈ సేవలను అందించే మీ సేవా కేంద్రాలు మూతపడే అవకాశం కనిపిస్తోంది. దీనిపై ఏపీ ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం ప్రకటించనుంది.
ఏపీలో గ్రామ గ్రామాన సచివాలయాల రాకతో ప్రభుత్వ సేవలన్నీ ఇకపై ఏకీకృతం కానున్నాయి. ఇప్పటివరకూ.. వివిధ ధృవపత్రాలు, బిల్లు చెల్లింపులు మీసేవా ద్వారా ప్రజలు పొందేవారు. ఇక నుంచి ఇవి గ్రామ సచివాలయాల ద్వారా.. ప్రజలకు దగ్గరగా రావడంతో.. ప్రజలు దీనిపై మొగ్గుచూపే అవకాశం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా.. ఓటర్ కార్డ్స్, రేషన్ కార్డ్స్, రేషన్ పంపిణీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇలా ప్రభుత్వానికి సంబంధించిన అన్ని సేవలూ సచివాలయాల్లోనే అందుబాటులోకి రానున్నాయి. దీంతో.. ఇప్పటివరకూ.. ఆయా సేవలకు కేంద్రంగా వున్న మీసేవా సెంటర్లు మూతపడక తప్పదు అనే అనిపిస్తోంది.
అంతేగాక.. మీసేవా సెంటర్లలలో తగిన సిబ్బంది కొరత, నాణ్యతా లోపం కూడా తలెత్తుతుండటం, సత్వరంగా పనులు జరగపోవడం వంటివి ప్రజలకు తలనొప్పిగా మారాయి. ఈ ప్రభావం కూడా.. గ్రామ సచివాలయాలకు ప్లస్ పాయింట్ అనే చెప్పాలి.