సిరీస్ విజయం.. చివరి వన్డేలో ఆసీస్ అద్భుత పోరాటం..

మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన చివరి వన్డేలో ఆస్ట్రేలియా అద్భుత విజయం సాధించింది. 303 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆసీస్‌ను..

సిరీస్ విజయం.. చివరి వన్డేలో ఆసీస్ అద్భుత పోరాటం..

Updated on: Sep 17, 2020 | 8:57 AM

మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన చివరి వన్డేలో ఆస్ట్రేలియా అద్భుత విజయం సాధించింది. 303 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆసీస్‌ను.. మ్యాక్స్‌వెల్‌(108), కారే(106)లు సెంచరీతో కదంతొక్కి విజయతీరాలకు చేర్చారు. దీనితో ఆస్ట్రేలియా మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో దక్కించుకుంది. (Maxwell, Carey stun England)

ఒక దశలో 73/5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును.. వీరిద్దరూ కలిసి ఆదుకున్నారు. ఆరో వికెట్‌కు 212 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక అంతకముందు బెయిర్‌స్టో(112), బిల్లింగ్స్(57), వోక్స్(53) ఆదరగొట్టడంతో ఇంగ్లాండ్ 302/7 స్కోర్ చేయగలిగింది. కాగా, మ్యాక్స్‌వెల్‌ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్ అవార్డులను దక్కించుకున్నాడు. అటు గాయం కారణంగా స్టీవ్ స్మిత్ ఈ వన్డే సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే.

Also Read:

బిగ్ బాస్ 4: గంగవ్వను బయటికి పంపే ప్లాన్.. అందుకే టార్గెట్ చేస్తున్నారా.!

బిగ్ బాస్ 4: ఈ సీజన్‌లో ఆమెదే భారీ రెమ్యునరేషన్

బిగ్ బాస్ హౌస్‌లోకి రామ్‌చరణ్ హీరోయిన్..!

సచివాలయ పరీక్షలకు సర్వం సిద్ధం.. వారికి ఐసోలేషన్ రూంలో ఎగ్జామ్!

ఏపీ వాహనదారులకు అలెర్ట్.. లైట్ తీసుకుంటే ఇక అంతే!

Loading...
Unable to load recommendations.
Follow Us