పాకిస్తాన్ లో పవర్ గ్రిడ్స్ వైఫల్యం, 114 నగరాల్లో కమ్ముకున్న చీకట్లు, ఆస్పత్రుల్లో కరోనా రోగులు విలవిల

| Edited By: Anil kumar poka

Jan 10, 2021 | 11:40 AM

పాకిస్తాన్ లో శనివారం రాత్రి పవర్ గ్రిడ్స్ వైఫల్యం కారణంగా ఒక్కసారిగా  విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇస్లామాబాద్, లాహోర్, కరాచీ...,

పాకిస్తాన్ లో  పవర్ గ్రిడ్స్ వైఫల్యం, 114 నగరాల్లో కమ్ముకున్న చీకట్లు, ఆస్పత్రుల్లో కరోనా రోగులు విలవిల
Follow us on

పాకిస్తాన్ లో శనివారం రాత్రి పవర్ గ్రిడ్స్ వైఫల్యం కారణంగా ఒక్కసారిగా  విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇస్లామాబాద్, లాహోర్, కరాచీ, రావల్పిండి వంటి రాష్ట్రాలు  చీకట్లో మగ్గాయి. దాదాపు 114 నగరాల్లో అంధకారం రాజ్యమేలింది. రాత్రి సుమారు 11.40 గంటల ప్రాంతంలో సింద్ ప్రావిన్స్ లోని గుడ్డు విద్యుత్ కేంద్రం గ్రిడ్ ఫెయిలయింది. నేషనల్ ట్రాన్స్ మిషన్ డిస్పాచ్ కంపెనీ లైన్లు ట్రిప్ అయ్యాయని ఇస్లామాబాద్ డిప్యూటీ కమిషనర్ హమ్జా షప్ ఖాత్ తెలిపారు. పవర్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ లో ఫ్రీక్వెన్సీ ఒక్కసారిగా 50 నుంచి జీరోకు పడిపోయిందని ఆయన పేర్కొన్నారు. ఒక్కసారిగా విద్యుత్ గ్రిడ్ కుప్ప కూలడానికి కారణాలను తెలుసుకుంటున్నామని ఈ శాఖ మంత్రి ఒమర్ ఆయూబ్ చెప్పారు.

ఈ వైపరీత్యం కారణంగా ఆస్పత్రుల్లో కరెంట్ లేక ముఖ్యంగా వెంటిలేటర్ పై ఉన్న వేలాది కరోనా రోగులు నానా అవస్థలు పడ్డారు. అటు డాక్టర్లు, వైద్య సిబ్బంది కూడా తీవ్ర ఆందోళన చెందారు. అటు-విద్యుత్ సరఫరాను చాలాసేపటికి పునరుధ్ధరించారు.

Read Also :కోవిడ్ నేపథ్యంలో నేవీ డే వేడుకలు.. విన్యాసాలు రద్దు.. విద్యుద్దీపాలతో సరిపెట్టిన అధికారులు..
Read Also :అలిపిరిలో మరోసారి భద్రతా సిబ్బంది వైఫల్యం, అన్యమత నినాదాలతో నేరుగా తిరుమలకు వచ్చిన వాహనం