సామూహిక శ్రీ మద్‌ రామాయణ పారాయణ కార్యక్రమంలో పాల్గొనండి…

|

Nov 01, 2020 | 11:46 PM

ప్రతి రోజు 5 నిమిషాలు...మొత్తం 27 రోజులు సమయం కేటాయిస్తే.. వాల్మీకి రామాయణంలోని శ్లోకాలు, అధ్యాయాలు జపించడం నేర్చుకుంటారని.. దాని వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందుతారని...

సామూహిక శ్రీ మద్‌ రామాయణ పారాయణ కార్యక్రమంలో పాల్గొనండి...
Follow us on

రామాయణం ఓ మహాకావ్యం. శ్రీ రాముని జీవిత చరిత్ర విన్నా లేదా చదివినా.. మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. వాల్మీకి రామాయణంలో మొత్తం 26 వేల శ్లోకాలు, 660 అధ్యాయాలు ఉన్నాయి‌. రామాయణ కావ్యం వినడం వల్ల ప్రజల జీవితాల్లో శాంతి, సంతోషం, మానసిక ఉల్లాసం కలుగుతుంది.

అందుకే ప్రపంచవ్యాప్తంగా ఈ బృహత్‌ కార్యక్రమాన్ని చేపట్టారు శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌స్వామి. ప్రతి రోజు 5 నిమిషాలు…మొత్తం 27 రోజులు సమయం కేటాయిస్తే.. వాల్మీకి రామాయణంలోని శ్లోకాలు, అధ్యాయాలు జపించడం నేర్చుకుంటారని.. దాని వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందుతారని స్వామిజీ పేర్కొన్నారు.

సామూహిక శ్రీ మద్‌ రామాయణ పారాయణం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలంటూ చినజీయర్‌ స్వామి పిలుపునిచ్చారు. నవంబర్‌ 6 నుండి డిసెంబర్‌ 4 వ తేదీ వరకు జరిగే ఈ మహా అద్భుత కార్యక్రమం కోసం www.chinnajeeyar.org ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా వేలాది మందితో కలిసి పఠించడంతో పాటు.. అద్భుత ఫలితాన్ని పొందుతారని తెలిపారు.