అగ్రరాజ్యంలో ఆగని మృత్యుహేల.. న్యూయార్క్ నగరంలో సామూహిక ఖననం..!

| Edited By:

Apr 10, 2020 | 2:05 PM

కోవిద్ 19 కరాళ నృత్యం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. కరోనా అంటే గుర్తొచ్చేవి స్పెయిన్‌, ఇటలీ. పదివేల మరణాలు చోటుచేసుకొన్న యూరప్‌ దేశాలివి. ఇప్పుడు ఈ లెక్కలనూ

అగ్రరాజ్యంలో ఆగని మృత్యుహేల.. న్యూయార్క్ నగరంలో సామూహిక ఖననం..!
Follow us on

కోవిద్ 19 కరాళ నృత్యం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. కరోనా అంటే గుర్తొచ్చేవి స్పెయిన్‌, ఇటలీ. పదివేల మరణాలు చోటుచేసుకొన్న యూరప్‌ దేశాలివి. ఇప్పుడు ఈ లెక్కలనూ అమెరికాలో కరోనా విలయం దాటేస్తోంది. యూరప్ లోని ఏ దేశంలోనూ ఒకే రోజు మరణాలు వెయ్యి దాటలేదు. కానీ, అమెరికాలో దాదాపు రెండు వేలమంది చొప్పున వరుసగా రెండురోజులు చనిపోవడంతో అక్కడ మరణాలు 16,074కు చేరుకొన్నాయి.

ఈ ప్రాణాంతక వైరస్ ప్రపంచంలోని అన్ని దేశాలకు విస్తరిస్తోంది. దీంతో, 15,238 మరణాలు చోటుచేసుకొన్న స్పెయిన్‌ను మించిన విషాదం అమెరికాలో అలుముకొంది. అందులోనూ న్యూయార్క్‌లో శవాలు గుట్టలు పడుతున్నాయి. 731 మంది మృతితో ఒకరోజు అత్యధిక మరణాలు సోమవారం చోటుచేసుకోగా, బుధవారం సంభవించిన 779 మరణాలు ఆ పాత లెక్కలను తుడిపేశాయి. కుప్పలుతెప్పలుగా వచ్చిపడిన పాజిటివ్‌ కేసులను చూడటానికి ఆస్పత్రులు చాలడం లేదు.

మరోవైపు.. కరోనా మహమ్మారి యూరప్ దేశాల్లో తగ్గుముఖం పడుతోంది! ప్రస్తుతం ఇటలీ, స్పెయిన్‌లో కొత్తగా కేసుల నమోదు తగ్గినట్లు గణాంకాలు రుజువు చేస్తున్నాయి. వాస్తవానికి ఈ రెండు దేశాల్లో ఈ నెలారంభంలో కరోనా తీవ్ర ప్రభావం చూ పింది. ఫలితంగా ఉభయ దేశాల్లో 30వేలకుపైగా మరణాలు చోటుచేసుకున్నాయి. కానీ, ఈ వారంలో అం దుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. కొత్తగా కేసులు, మరణాలు గణనీయంగా తగ్గాయి.