వ్యాక్సిన్ వ‌చ్చినా.. మాస్కు, సామాజిక దూరం త‌ప్పద‌ట‌..!

| Edited By:

Aug 01, 2020 | 8:49 PM

దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ మ‌హ‌మ్మారిని పూర్తిగా నిర్మూలించాలంటే వ్యాక్సిన్ త‌ప్ప మ‌రో మార్గం లేక‌పోవ‌డంతో.. వివిధ దేశాల శాస్త్ర‌వేత్త‌లు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసే ప‌నిలోపడ్డారు.

వ్యాక్సిన్ వ‌చ్చినా.. మాస్కు, సామాజిక దూరం త‌ప్పద‌ట‌..!
Follow us on

దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ మ‌హ‌మ్మారిని పూర్తిగా నిర్మూలించాలంటే వ్యాక్సిన్ త‌ప్ప మ‌రో మార్గం లేక‌పోవ‌డంతో.. వివిధ దేశాల శాస్త్ర‌వేత్త‌లు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసే ప‌నిలోపడ్డారు. అయితే, వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌చ్చినా ప్ర‌జ‌లు మాస్కులు ధ‌రించ‌డం, సామాజిక దూరం పాటించ‌డం అనేవి కీల‌కంగా మారుతాయ‌ని ఆమెరికాకు చెందిన మ‌రియా ఎలెనా బొటాజ్జీ అనే శాస్త్ర‌వేత్త పేర్కొన్నారు.

ఈ మహమ్మారి కట్టడికోసం ప్రపంచదేశాలన్ని వ్యాక్సిన్ కనుగొనే దిశగా తలమునకలై ఉన్నాయి. కోవిద్-19 వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తుల ద్వారా కూడా వైర‌స్ ఇత‌రుల‌కు సంక్ర‌మించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని చెప్పారు. క‌రోనా వ్యాక్సిన్ తీసుకుంటే మునుప‌టిలాగే ఇప్పుడు కూడా త‌మ ప‌నులు తాము చ‌క్క‌బెట్టుకోవ‌చ్చ‌ని ఎవ‌రైనా అనుకుంటే పొర‌ప‌డిన‌ట్లేన‌ని బొటాజ్జీ పేర్కొన్నారు. కాగా, కరోనా మ‌హ‌మ్మారి నిర్మూల‌న కోసం ప్ర‌పంచ‌వ్యాప్తంగా 150 వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేస్తున్నారు. అందులో 26 వ్యాక్సిన్‌లు మ‌నుషుల‌పై ట్ర‌య‌ల్స్ ద‌శ‌కు చేరుకున్నాయి. ఆ 26 వ్యాక్సిన్‌ల‌లో ఐదు వ్యాక్సిన్‌లు క్లినిక‌ల్ ట్రయ‌ల్స్‌లో ఆఖ‌రి ద‌శ‌కు చేరుకున్నాయి.