కమాండర్ మోడియం విజ్జను కాల్చిచంపిన మావో నాయకత్వం

|

Oct 02, 2020 | 10:19 PM

చత్తీస్ ఘడ్ బీజాపూర్ జిల్లాలో ఒక్కసారిగా అలజడి రేగింది. మావోయిస్ట్ కమాండర్ మోడియం విజ్జ అలియాస్ భుధ్రును మావోయిస్ట్ నాయకత్వం కాల్చి చంపింది. ఇటీవల బీజాపూర్ జిల్లాలో ఇన్ఫార్మర్ల నెపంతో గ్రామస్థులను భుధ్రు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మావోలు భుధ్రుని మట్టుబెట్టారు. గంగుళూర్ అటవీప్రాంతంలో ఈ హత్యకు పాల్పడ్డారు మావోయిస్టులు. మృత దేహాన్ని భుధ్రు బంధువులకు అప్పగించారు. ఈ ఘటనను బస్తర్ IG సుందర్ రాజ్ అధికారికంగా దృవీకరించారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో […]

కమాండర్ మోడియం విజ్జను కాల్చిచంపిన మావో నాయకత్వం
Follow us on

చత్తీస్ ఘడ్ బీజాపూర్ జిల్లాలో ఒక్కసారిగా అలజడి రేగింది. మావోయిస్ట్ కమాండర్ మోడియం విజ్జ అలియాస్ భుధ్రును మావోయిస్ట్ నాయకత్వం కాల్చి చంపింది. ఇటీవల బీజాపూర్ జిల్లాలో ఇన్ఫార్మర్ల నెపంతో గ్రామస్థులను భుధ్రు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మావోలు భుధ్రుని మట్టుబెట్టారు. గంగుళూర్ అటవీప్రాంతంలో ఈ హత్యకు పాల్పడ్డారు మావోయిస్టులు. మృత దేహాన్ని భుధ్రు బంధువులకు అప్పగించారు. ఈ ఘటనను బస్తర్ IG సుందర్ రాజ్ అధికారికంగా దృవీకరించారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో అలర్ట్ అయిన పోలీసులు గంగుళూర్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ ముమ్మరం చేశారు.