తెలంగాణలో టెన్షన్.. టెన్షన్…. ఏం జరుగుతోంది..?

|

Jul 15, 2020 | 2:57 PM

పెద్ద సంఖ్యలో మావోయిస్టులు వచ్చి తెలంగాణ ప్రాంతంలోని గిరిజనులను, స్థానికులను ప్రభావితం చేయడానికి యత్నిస్తున్నారని నిఘా వర్గాలు సమాచారాన్ని సేకరించాయి. ఈ నేపథ్యంలో పోలీసు శాఖ..

తెలంగాణలో టెన్షన్.. టెన్షన్.... ఏం జరుగుతోంది..?
Follow us on

Maoist Action Teams in Telangana  : ఛత్తీస్‌గడ్ నుంచి పెద్ద సంఖ్యలో మావోయిస్టులు వచ్చి తెలంగాణ ప్రాంతంలోని గిరిజనులను, స్థానికులను ప్రభావితం చేయడానికి యత్నిస్తున్నారని నిఘా వర్గాలు సమాచారాన్ని సేకరించాయి. ఈ నేపథ్యంలో పోలీసు శాఖ అప్రమత్తం అయ్యింది. అవసరమైన చోట్లకు గ్రే హౌండ్స్ ను రంగంలోకి దింపింది. ఛత్తీస్‌గడ్, మహారాష్ట్ర సరిహద్దులలో ఉన్న జిల్లాలలో, దండకారణ్య ప్రాంతంలో పూర్తి స్థాయి భద్రతను పెంచుతున్నారు. ఇప్పటికే కొన్ని సరిహద్దు జిల్లాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు.

అంతేకాకుండా తెలంగాణలోని అధికార పార్టీ ఎమ్మెల్యేలను మావోయిస్టులు టార్గెట్‌ చేసినట్లుగా తెలుస్తోంది. మావోయిస్టుల యాక్షన్‌ ఫ్లాన్‌ను‌ సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో ఖమ్మం, ఆదిలాబాద్‌, వరంగల్‌ జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలకు భద్రత పెంచారు. ఏజెన్సీ ప్రాంతాలలో ముందస్తు సమాచారం లేకుండా పర్యటించొద్దని ప్రజాప్రతినిధులకు పోలీసుల సూచనలు చేశారు.