రోడ్ సేఫ్టీ కోసం ట్రాఫిక్ డ్రైవ్.. లైసెన్స్‌ల రద్దుపై దృష్టి

| Edited By: Pardhasaradhi Peri

Jul 01, 2019 | 6:36 PM

తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ట్రాఫిక్ అధికారులు ఎన్నో చర్యలను తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ట్రాఫిక్ రూల్స్ పాటించని వారికి తగు జరిమానాలు వేయడం, డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దు చేయడం లాంటివి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గత ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 13,971మంది డ్రైవింగ్ లైసెన్స్‌ను రోడ్డు రవాణా శాఖ అధికారులు రద్దు చేశారు. ఓవర్ స్పీడు, ఓవర్ లోడింగ్, సరకులు తరలించే వాహనాల్లో ప్రయాణికులను ఎక్కించుకోవడం, వాహనాలు నడిపేటప్పుడు ఫోన్ వాడటం, మద్యం, మత్తు పదార్థాలు […]

రోడ్ సేఫ్టీ కోసం ట్రాఫిక్ డ్రైవ్.. లైసెన్స్‌ల రద్దుపై దృష్టి
Follow us on

తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ట్రాఫిక్ అధికారులు ఎన్నో చర్యలను తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ట్రాఫిక్ రూల్స్ పాటించని వారికి తగు జరిమానాలు వేయడం, డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దు చేయడం లాంటివి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గత ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 13,971మంది డ్రైవింగ్ లైసెన్స్‌ను రోడ్డు రవాణా శాఖ అధికారులు రద్దు చేశారు. ఓవర్ స్పీడు, ఓవర్ లోడింగ్, సరకులు తరలించే వాహనాల్లో ప్రయాణికులను ఎక్కించుకోవడం, వాహనాలు నడిపేటప్పుడు ఫోన్ వాడటం, మద్యం, మత్తు పదార్థాలు సేవించి వాహనాలు నడపడం, యాక్సిడెంట్, కోర్టు కేసులు వంటి వాటిని పరిగణలోకి తీసుకొని.. ఈ చర్యకు ఉపక్రమించారు. హైదరాబాద్‌లోనే ఎక్కువగా 2,117లైసెన్స్‌లను వారు రద్దు చేయడం విశేషం.

దీనిపై ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ రోడ్ సేఫ్టీ(భారత రోడ్డు రవాణా భద్రతా సమాఖ్య)చైర్మన్ వినోద్ కనుమల మాట్లాడుతూ.. ‘‘రోడ్డు భద్రతా ప్రమాణాలను పెంచడంలో హైదరాబాద్ పోలీసులు టాప్‌లో ఉన్నారు. నియమాలను ఉల్లంఘించే వారికి వారు వేస్తున్న శిక్షల వలన రోడ్డు ప్రమాదాలను కొంతమేర తగ్గించవచ్చు. వారి సేవలు అభినందనీయం’’ అని పేర్కొన్నారు. కాగా ఒకసారి లైసెన్స్ రద్దు అయితే మరో ఆరు నెలల వరకు కొత్త లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండదు.