సింహాచలం ఆలయ, మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ సంచయిత గజపతి టీడీపీ నేతలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం ప్రదర్శించారు. టీడీపీ సీనియర్ నాయకులైన మీరు బాధ్యతారాహిత్యమైన ప్రకటనలు చేయడం, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం భావ్యమా? అంటూ చింతకాయల అయ్యన్నపాత్రుడిని ప్రశ్నించారు. దీనికి సంబంధించి వరుస ట్వీట్లు కుమ్మరించిన సంచయిత అనేక అంశాలను ప్రస్తావిస్తూ అయ్యన్న, తెలుగుదేశం పార్టీ, అశోక్ గజపతిరాజు, చంద్రబాబులను నిలదీసే ప్రయత్నం చేశారు. ‘నేను అశోక్ గజపతి గారి అన్నయ్య ఆనంద గజపతిరాజు గారి పెద్ద కుమార్తెను. చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ఎందుకు వణికిపోతోంది? సింహాచలం దేవస్థానంలో ఫోరెన్సిక్ ఆడిట్ ప్రారంభించడం వల్ల మీ తప్పులు మిమ్మల్ని వెంటాడతాయని భయంగా ఉందా? మీ టీడీపీ నేతలు, మద్దతుదారులు దేవాలయ భూములను ఆక్రమించడం నిజం కాదా? టీడీపీకి చెందిన మీ నాయకుడు చైర్మన్ గా ఉన్నప్పుడు ఆలయానికి చెందిన విలువైన వస్తువులు మాయం అయ్యాయని ఆరోపణలు రాలేదా? గడచిన ఐదేళ్లుగా దేవాలయ ఆస్తులపై లెక్కలు ఎందుకు సరిగ్గా రాయలేదు? ఆలయానికి వచ్చే రాబడి, ఖర్చులు చెప్పే ఖాతాలను సరైన పద్ధతిలో ఎందుకు నిర్ధారించలేదు? అయ్యన్న గారూ… కొండదిగువన చైర్మన్ కోసం ఉద్దేశించిన బంగ్లాను మీ సహచరుడు అశోక్ ఇంకా ఎందుకు ఖాళీ చేయలేదు? దీని పేరుమీద ఎన్ని బిల్లులు పెట్టారో తెలుసా? కానీ ఈ విషయాలను నేను మాట్లాడడం లేదు. ఎందుకంటే ఆయన తల్లి గతంలో ఇదే బంగ్లాలో ఉన్నారు కాబట్టి… ఆమె జ్ఞాపకాలను ఆయన గుర్తు చేసుకుంటూ ఉంటారని భావిస్తున్నాను కాబట్టి’ అంటూ సంచయిత వరుస ట్వీట్లు చేస్తూ సెంటిమెంట్ జోడించిమరీ తెలుగుదేశం పార్టీ పెద్దలపై విరుచుకుపడ్డారు.
శ్రీ@AyyannaPatruduC గారూ మీరు @JaiTDP సీనియర్ నాయకులు. బాధ్యతారాహిత్యమైన ప్రకటనలు చేయడం, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం మీకు భావ్యమా? @Ashok_Gajapathi గారి అన్న ఆనందగజపతిరాజుగారి పెద్దకుమార్తెను నేను. @NCBN నేతృత్వంలోని టీడీపీ ఎందుకు వణికిపోతుంది? (1/5)
— Sanchaita Gajapati (@sanagajapati) September 7, 2020
సింహాచలం దేవస్థానంలో ఫోరెన్సిక్ ఆడిట్ మొదలుపెట్టడంవల్ల మీ తప్పులు మిమ్మల్ని వెంటాడుతాయని భయంగా ఉందా? మీ టీడీపీ నాయకులు, మద్దతు దారులు దేవాలయ భూముల్ని ఆక్రమించడం నిజంకాదా? (2/5)
— Sanchaita Gajapati (@sanagajapati) September 7, 2020
టీడీపీకి చెందిన మీ నాయకుడు ఛైర్మన్గా ఉన్నప్పుడు దేవాలయానికిచెందిన విలువైన వస్తువులు మాయం అయ్యాయని ఆరోపణలు రాలేదా? గడచిన ఐదేళ్లుగా దేవాలయ ఆస్తులపై లెక్కలు ఎందుకు సరిగ్గా రాయలేదు? దేవాలయానికి వచ్చే రాబడి, ఖర్చులు చెప్పే ఖాతాలను సరైన పద్ధితిలో ఎందుకు నిర్ధారించలేదు? (3/5)
— Sanchaita Gajapati (@sanagajapati) September 7, 2020
అయ్యన్నగారూ మీకు తెలియని విషయం ఏంటంటే.. కొండదిగువన ఉన్న ఛైర్మన్కోసం ఉద్దేశించిన బంగ్లాను మీ సహచరుడు అశోక్ ఇంకా ఎందుకు ఖాళీచేయలేదు? దీనిపేరుమీద ఎన్ని బిల్లులు పెట్టారో మీకు తెలుసా? (4/5)
— Sanchaita Gajapati (@sanagajapati) September 7, 2020
కానీ ఈ విషయాలను నేను మాట్లాడ్డం లేదు. ఎందుకంటే… ఆయన తల్లి ఇదే బంగ్లాలో ఉన్నారు కాబట్టి, ఆమె జ్ఞాపకాలను ఆయన గుర్తుచేసుకుంటూ ఉంటూరనే భావిస్తున్నాను కాబట్టి ! (5/5)
— Sanchaita Gajapati (@sanagajapati) September 7, 2020