జగన్‌ను కలిసిన మంచు విష్ణు దంపతులు

హైదరాబాద్: ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి. ఎవరు ఎవర్ని కలుస్తున్నారనే ఆసక్తి పెరగతుండటంతో పాటు దాని వెనక ఉన్న మతలబులపై పలు ఊహాగానాలు, అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జగన్‌తో భేటీ అయిన అనంతరం పలువురు నాయకులు వైసీపీలో చేరుతుండటంతో ఏ రంగానికి చెందినవారు ఆయన్ను కలిసినా అదే తరహాలో రాజకీయ కోణం నుంచి చర్చలు మొదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో సీనీ నటుడు మంచు విష్ణు తన సతీమణితో కలిసి వైఎస్ జగన్‌ను […]

జగన్‌ను కలిసిన మంచు విష్ణు దంపతులు

Edited By:

Updated on: Oct 18, 2020 | 7:47 PM

హైదరాబాద్: ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి. ఎవరు ఎవర్ని కలుస్తున్నారనే ఆసక్తి పెరగతుండటంతో పాటు దాని వెనక ఉన్న మతలబులపై పలు ఊహాగానాలు, అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జగన్‌తో భేటీ అయిన అనంతరం పలువురు నాయకులు వైసీపీలో చేరుతుండటంతో ఏ రంగానికి చెందినవారు ఆయన్ను కలిసినా అదే తరహాలో రాజకీయ కోణం నుంచి చర్చలు మొదలవుతున్నాయి.

ఈ నేపథ్యంలో సీనీ నటుడు మంచు విష్ణు తన సతీమణితో కలిసి వైఎస్ జగన్‌ను కలిశారు. లోటస్ పాండ్‌కు వెళ్లి మరీ భేటీ అయ్యారు. అయితే జగన్‌కు విష్ణు భార్య విరోనిక బంధువు అవుతుంది. దీంతో బంధుత్వం మీద జరిగిన కలయిక లేక రాజకీయ కలయిక అనే అనుమానాలు తలెత్తాయి. ఇందుకు కారణం విష్ణు తండ్రి మంచు మోహన్ బాబు జరగనున్న ఎన్నికల్లో వైసీపీ నుంచి బరిలోకి దిగబోతున్నట్టు ప్రచారం నడిచింది.