సీఎం పీఏ అంటూ మోసం చేస్తోన్న వ్య‌క్తి అరెస్ట్

|

Aug 22, 2020 | 5:56 PM

తెలంగాణ సీఎం కేసీఆర్ పీఏ అని చెప్పుకుంటూ ప్రజలను మోసం చేయటానికి ప్రయత్నించిన వ్య‌క్తిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు శ‌నివారం అరెస్ట్‌ అయ్యాడు.

సీఎం పీఏ అంటూ మోసం చేస్తోన్న వ్య‌క్తి అరెస్ట్
Follow us on

తెలంగాణ సీఎం కేసీఆర్ పీఏ అని చెప్పుకుంటూ ప్రజలను మోసం చేయటానికి ప్రయత్నించిన వ్య‌క్తిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు శ‌నివారం అరెస్ట్‌ అయ్యాడు. తిమ్మాపూర్‌ మండలం, మొగిలిపాలెం విలేజ్‌కి చెందిన సాయి చందన్‌ కరీంనగర్‌లోని విద్యానగర్‌లో ఉంటున్నాడు. ముఖ్య‌మంత్రి అడిషినల్‌ సెక్రటరీగా, సీఎం ఫ్యామిలీ వ్య‌వ‌హారాలు చూస్తుండటంతో పాటు ఏసీబీ కరీంనగర్ జిల్లా ఛైర్మన్‌గా కొనసాగుతున్నానని చెప్పుకుంటూ గత కొద్ది నెలలుగా ప్రజలను మ‌భ్య‌పెడుతున్నాడు. ఆ ప్రాంత ప్ర‌జ‌ల‌ను ఓ ర‌కంగా భ‌య‌బ్రాంతుల‌కు గురిచేశాడు. సీఎం ఆఫీసుకు చెందిన రాజశేఖర్ రెడ్డి పేరు మీద ఫేక్‌ నియామకపు ఉత్తర్వులు క్రియేట్ చేశాడు. న‌కిలీ ఐడీ కార్డు కూడా సృష్టించాడు. వాటిని అంద‌ర‌కీ చూపిస్తూ, సీఎం కేసీఆర్, కేటీఆర్‌ల‌తో దిగిన ఫోటోల‌ను వాడుకుంటూ మోసం చేసేందుకు ప్ర‌య‌త్నించాడు.

ఈ స‌మాచారం టాస్క్‌ఫోర్స్ చెవిన ప‌డింది. అత‌డు మ‌రీ ఓవ‌రాక్ష‌న్ చేస్తుండ‌టంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా సీఎం న‌కిలీ పీఏ బాగోతం వెలుగులోకి వ‌చ్చింది.

Also Read :

ఏపీ : బదిలీలు, నియామకాల విధానం రివ్యూకు కమిటీ

బాస్ బ‌ర్త్ డేకు నెల్లూరు కుర్రోళ్ల స్వీట్ గిఫ్ట్‌