Man Sleeps With Cobra: పెంపుడుపాముతో కలిసి నిద్రించిన యజమాని.. ఆ పై తన తన గుణం చూపించిన పాము

Man Sleeps With Cobra: పాముకు పాలు పోసి ప్రేమగా పెంచినా విషం చిమ్ముతుందని సామెతను రుజువు చేస్తూ చైనాలో ఒక ఘటన చోటు చేసుకుంది. పాము పెంచుకోవాలని కోరికతో..

Man Sleeps With Cobra: పెంపుడుపాముతో కలిసి నిద్రించిన యజమాని.. ఆ పై తన తన గుణం చూపించిన పాము
Man With Snake

Updated on: Jun 06, 2021 | 5:48 PM

Man Sleeps With Cobra: పాముకు పాలు పోసి ప్రేమగా పెంచినా విషం చిమ్ముతుందని సామెతను రుజువు చేస్తూ చైనాలో ఒక ఘటన చోటు చేసుకుంది. పాము పెంచుకోవాలని కోరికతో ఒక కోబ్రాను కోలుగోలు చేసిన వ్యక్తి ఆ పాము కాటు నుంచి తృటిలో మరణం నుంచి తప్పించుకున్నాడు. ఆ పాము నుంచి అప్పటికే విషం తీసేశామని అమ్మిన వ్యక్తి చెప్పాడని పామును పెంచుకోవాలని అనుకున్న వ్యక్తి చెప్పాడు. వివరాల్లోకి వెళ్తే..

ఈశాన్య చైనాలోని హీలాంగ్జియాంగ్ ప్రావిన్స్ లో లియు అనే వ్యక్తి ఒక పెంపుడు జంతువును పెంచుకోవాలని భావించాడు. అందుకోసం ఆన్ లైన్లో ఒక మీటర్ పొడవైన కోబ్రాను కొనుగోలు చేశాడు. అయితే పామును అమ్మిన వ్యక్తి.. ఆ కోబ్రా యొక్క విష గ్రంధిని తీసేసానని చెప్పాడు. ఆ మాటను నమ్మిన లియు  పాముతో పాటు జీవించడం మొదలు పెట్టాడు. ఒకరోజు కోబ్రాతో పాటు లియు మంచంమీద ఉన్న సమయంలో పాము తన సహజ గుణాన్ని చూపిస్తూ.. అతని తొడపై కొరికింది. లియు ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. తక్షణ చికిత్స అందించడంతో కోబ్రా కాటు నుండి బయటపడగలిగాడు.అయితే లియూకి చికిత్సనందించిన వైద్యుడు అతడిని కరిసించి ప్రమాదకరమైన పాము అని.. దీని విషం ప్రాణాలను సైతం తీస్తుందని ఇకనుంచైనా జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాడు. దీంతో తనకు పాముని అమ్మిన వ్యక్తి కలిసి ప్రశ్నించాడు.. అప్పుడు పాముని విక్రయించిన వ్యక్తి.. నిజాయతీగా తప్పు చేశానని .. లియూకి  విషపూరితమైన తప్పుడు కోబ్రాను పంపానని అంగీకరించాడు. ఇప్పుడు లియూకి జ్ఞానోదయమై.. ఇంకెప్పుడూ పాముని పెంపుడు జంతువుగా పెంచనని ప్రతిజ్ఞ చేశాడు.