చేతబడి నెపంతో ఓ వ్యక్తి దారుణహత్య

చేతబడి చేస్తున్నాడన్న నెపంతో ఓ వ్యక్తిని అతి దారుణంగా హత్య చేసిన ఘటన ములుగు జిల్లాలో చోటుచేసుకుంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం జలగలవంచ గొత్తికోయగుంపుకు చెందిన అనిల్ అనే యువకుడిపై అదే గ్రామానికి చెందిన పురకసం బద్రీ, మడకం మంగయ్యలు అతనిపై దాడి చేసి హత్య చేశారు.

చేతబడి నెపంతో ఓ వ్యక్తి దారుణహత్య

Updated on: Jul 27, 2020 | 7:24 PM

చేతబడి చేస్తున్నాడన్న నెపంతో ఓ వ్యక్తిని అతి దారుణంగా హత్య చేసిన ఘటన ములుగు జిల్లాలో చోటుచేసుకుంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం జలగలవంచ గొత్తికోయగుంపుకు చెందిన అనిల్ అనే యువకుడిపై అదే గ్రామానికి చెందిన పురకసం బద్రీ, మడకం మంగయ్యలు అతనిపై దాడి చేశారు. గొడ్డలితో నరికి, ఆపై కత్తితో గొంతు కోసి హతమార్చారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న తాడ్వాయి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అనిల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు. అనిల్ ను హత్య చేసిన బద్రీ, మంగయ్యలను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.