Crime News : భార్యను బూతులు తిట్టాడని స్నేహితుడ్ని చంపేశాడు..ఆపై మృతదేహాన్ని ముక్కలుగా కోసి

|

Dec 20, 2020 | 3:31 PM

తన భార్యను బూతులు తిట్టాడన్న ఆవేశంలో మిత్రుడ్ని అంతమొందించాడు ఓ వ్యక్తి.  అక్కడితో ఆగలేదు..మృతుడి  డెడ్‌బాడీని 10 ముక్కలుగా చేసి డ్రైనేజీ కాల్వలో పడేశాడు.

Crime News : భార్యను బూతులు తిట్టాడని స్నేహితుడ్ని చంపేశాడు..ఆపై మృతదేహాన్ని ముక్కలుగా కోసి
Follow us on

తన భార్యను బూతులు తిట్టాడన్న ఆవేశంలో మిత్రుడ్ని అంతమొందించాడు ఓ వ్యక్తి.  అక్కడితో ఆగలేదు..మృతుడి  డెడ్‌బాడీని 10 ముక్కలుగా చేసి డ్రైనేజీ కాల్వలో పడేశాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైలోని వోర్లీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నివశిస్తోన్న సుశీల్‌ కుమార్‌ సర్‌నాయక్‌ వ్యక్తి ఓ బ్యాంకు ఉద్యోగం చేస్తున్నాడు. గత శనివారం ఫ్రెండ్‌ను కలవటానికి విరార్‌కు వెళుతున్నానని కుటుంబ సభ్యులతో చెప్పి బయటకు వెళ్లాడు. ఆ తర్వాత తిరిగి ఇంటికి రాలేదు. దీంతో అతడి తల్లి సోమవారం పోలీసులకు కంప్లైంట్ చేసింది

మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బుధవారం నేరల్‌ రైల్వే స్టేషన్‌ దగ్గర్లో డ్రైనేజ్ కాల్వలో పడి ఉన్న ఓ బ్యాగులో మనిషి శరీర భాగాలు ఉన్నాయంటూ పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందింది. దీంతో స్పాట్‌కు చేరుకున్న పోలీసులు సదరు బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దగ్గర్లోని సీసీ టీవీ ఫుటేజ్‌ పరిశీలించగా నాడార్‌ అనే వ్యక్తి బ్యాగులను మోసుకెళుతూ కనిపించాడు. దీంతో అతడ్ని అదుపులోకి విచారించగా..తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.

భార్యను బూతు మాటలు అనడంతో చంపేశాడు :

శనివారం  బయటకు వెళ్లిన సుశీల్‌.. ఇంట్లో చెప్పినట్లు విరార్‌కు కాకుండా నేరల్‌లోని స్నేహితుడు చార్లెస్‌ నాడార్‌ ఇంటికి వెళ్లాడు. అక్కడ ఇద్దరూ కలిసి మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మద్యం సేవించారు.  మద్యం మత్తులో ఉన్న సుశీల్‌.. నాడార్‌ భార్యపై నోరు పారేసుకున్నాడు. తన అర్ధాంగిని అసహ్యంగా తిట్టడంతో తట్టుకోలేకపోయిన నాడార్‌ అతడ్ని చంపేశాడు. అనంతరం డెడ్‌బాడీని 10 ముక్కలు చేసి, బ్యాగుల్లో నింపి నేరల్‌ రైల్వే స్టేషన్‌కు దగ్గరలోని మురికి కాల్వలో పడేశాడు.

Aso Read :

Tirumala Tirupati : శ్రీవారి సర్వ దర్శనం టోకెన్ల జారీ వివాదం..భక్తుల ఆందోళన..స్పందించిన టీటీడీ

Road Accident : తూర్పు గోదావరి జిల్లాలో విషాదం..రోడ్డు ప్రమాదంలో తండ్రి కళ్లెదుటే ఇద్దరు చిన్నారులు మృతి