Viral Video: తొమ్మిదో అంతస్తు నుంచి కిందపడ్డ మహిళ.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైరల్!

మాములుగా ఎత్తయిన బిల్డింగ్‌ల పైనుంచి కిందకు చూస్తే చాలు.. కళ్లు బైర్లు కమ్ముతాయి. అలాంటిది వాటి మీద నుంచి కిందపడితే ఇంకేమైనా ఉందా.!

Viral Video: తొమ్మిదో అంతస్తు నుంచి కిందపడ్డ మహిళ.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైరల్!
Woman Pic
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 15, 2021 | 6:19 PM

(ఈ ఆర్టికల్‌లోని విజువల్స్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. సున్నితమైన మనసు కలిగిన వారు వీడియోకు దూరంగా ఉండటం మంచిది)

మాములుగా ఎత్తయిన బిల్డింగ్‌ల పైనుంచి కిందకు చూస్తే చాలు.. కళ్లు బైర్లు కమ్ముతాయి. అలాంటిది వాటి మీద నుంచి కిందపడితే ఇంకేమైనా ఉందా.! మార్గం మధ్యలోనే ప్రాణాలు పోతాయి. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.! ఓ మహిళ ప్రమాదవశాత్తు తొమ్మిది అంతస్తు నుంచి కిందపడి బతికి బట్టకట్టింది. తీవ్ర గాయాలతో బయటపడిన ఆమె ప్రస్తుతం సీరియస్ కండిషన్‌లో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఘజియాబాద్‌లో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన షాకింగ్ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వివరాలు..

ఘజియాబాద్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లోని తొమ్మిదో అంతస్తులో నివాసముంటున్న దంపతుల మధ్య గొడవ జరిగింది. ఇద్దరి మధ్య అది కాస్తా పెద్దది కావడంతో.. ఆమె రైలింగ్ మీద నుంచి కిందకు దూకేసింది. దీనితో ఒక్కసారిగా షాక్‌కు గురైన ఆమె భర్త.. సదరు మహిళ చేతిని గట్టిగా పట్టుకుని పైకి లాగేందుకు ప్రయత్నించాడు. దాదాపు మూడు నిమిషాల పాటు అతడు తీవ్రంగా శ్రమించాడు. అయినా ప్రయోజనం లేకపోయింది. అతడి చెయ్యి పట్టు తప్పింది. అంతే ఆమె ఒక్కసారిగా అమాంతం తొమ్మిదో అంతస్తు నుంచి కిందకు పడిపోయింది. అయితే ఈలోపే స్థానికులు ఇదంతా గమనించి.. ఆమెకు గాయాలు కాకుండా ఉండేందుకు కింద పరుపులు అమర్చారు. అయినప్పటికీ ఆమెకు గాయాలయ్యాయి.

కాగా, దీనితో ఆమె భర్త స్థానికుల సహాయంతో సదరు మహిళను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందకపోయినా.. పోలీసులు తమ విచారణను ప్రారంభించారు. వివిధ కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:

పాపం మొసలి.! కొండచిలువ తలను కొరికింది.. ప్రాణాల మీదకు తెచ్చుకుంది.. వైరల్ వీడియో!

ఈ ఫోటోలో మంచు చిరుత దాగుంది.. అదెక్కడ ఉందో గుర్తించండి.! మెదడుకు పదును పెట్టండి!

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..