కరోనా మహమ్మారి నా అన్నవాళ్లను సైతం దూరం చేస్తోంది. చనిపోయిన వ్యక్తి దగ్గరకు వెళ్లాలంటే సాహసకృత్యమే అవుతుంది. బంధవులు, రక్తసంబంధీకులు మృతదేహలకు దహసంస్కారాలు చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారు. తాజాగా కరోనా వ్యాధి సోకి ఇంట్లో మరణించిన యువకుడి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు తోపుడు బండిపై అంత్యక్రియలకు నిర్వహించిన ఘటన మహారాష్ట్రలో వెలుగుచూసింది.
పూణెలోని ఖానాపూర్‌కు చెందిన ఓ యువకుడికి ఇటీవల కరోనా పాజిటివ్ గా తేలింది. కాగా, శ్వాసకోశ సమస్య ఉండడంతో అస్పత్రికి తరలించిన కుటుంబసభ్యలు చికిత్స చేయిస్తున్నారు. అయితే, ఆస్పత్రిలోని క్వారంటైన్ వార్డులో బెడ్‌లు ఖాళీగా లేకపోవడంతో యువకుడు వైద్యులను సంప్రదించకుండానే ఇంటికి వెళ్లిపోయాడు. ఆరోగ్యం క్షీణించి శుక్రవారం మృతిచెందాడు. కాగా మృతదేహనికి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబసభ్యులు ఏర్పాటు చేశారు. డెడ్ బాడీని తరలించేందుకు అంబలెన్స్‌కు ఫోన్‌చేయగా వారు స్పందించకపోవడంతో చేసేది లేక కుటుంబ సభ్యులే తోపుడు బండిపై మృతదేహన్ని తరలించి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. మృతదేహల తరలింపు వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి నెలకొందని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై జిల్లా వైద్యాధికారి స్పందిస్తూ బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Maharashtra: Body of youth, who died of COVID-19 at his home, was carried on a handcart in Khanapur village of Pune. “He died because he couldn’t get a bed in any hospital. When his health deteriorated, we called the ambulance but to no avail,” says the village sarpanch. (11.09) pic.twitter.com/m89yLDeitm
— ANI (@ANI) September 12, 2020