East Godavari Murder: తూర్పుగోదావరి జిల్లాలో వ్యక్తి దారుణ హత్య.. స్పాట్‌కు అదనపు ఎస్పీ.. రంగంలోకి డాగ్ స్క్వాడ్
తూర్పుగోదావరి జిల్లా గొల్లలమామిడాడలో వ్యక్తిని దారుణంగా హతమార్చారు గుర్తు తెలియని దుండగులు. మేడపాటి సూర్యనారారణ రెడ్డిపై కత్తులతో దాడికి తెగబడ్డారు.

East Godavari Murder: తూర్పుగోదావరి జిల్లా గొల్లలమామిడాడలో వ్యక్తిని దారుణంగా హతమార్చారు గుర్తు తెలియని దుండగులు. మేడపాటి సూర్యనారారణ రెడ్డిపై కత్తులతో దాడికి తెగబడ్డారు. తీవ్రగాయాలైన సూర్యనారయణ రెడ్డి ఆస్పత్రికి తరలిస్తుండగా కన్నుమూశాడు. దాడిని అడ్డుకోబోయిన భార్యకు గాయాలయ్యాయి. ముసుగులు వేసుకుని వచ్చి దుండగులు దాడికి పాల్పడినట్లు తెలుస్తుంది. ఘటనాస్థలిని అదనపు ఎస్పీ కరణం కుమార్ పరిశీలించారు.
స్పాట్‌కు చేరకున్న క్లూస్ టీమ్ వేలిముద్రలు సేకరిస్తుంది. నిందితుల ఆచూకి కోసం డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించారు. సూర్యనారయణ రెడ్డ గతంలో ఓ వ్యక్తి హత్య కేసులో ప్రధాన నిందతుడిగా ఉన్నారు. గ్రూపు తగాదాలే ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. ప్రశాంతంగా ఉండే గొల్లలమామిడాడలో ఈ దారుణ హత్య కలకలం రేపింది.
Also Read :
జంగారెడ్డిగూడెంలో హృదయ విదారక ఘటన.. తల్లి మృతదేహంతోనే ఐదు రోజులు జీవనం
భర్త స్నేహితుడితో సాన్నిహిత్యం..కట్టుకున్నవాడిని చంపించిన వైనం..గుత్తిలో దారుణం
