Mamata Banerjee : ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాం… ఎంతో శ్రమించాం… భవిష్యత్‌లో శ్రమిస్తూనే ఉంటాం…

| Edited By:

Jan 02, 2021 | 5:45 AM

‘‘తృణమూల్‌ కాంగ్రెస్‌కు నేటితో 23 ఏళ్లు పూర్తయ్యాయి. 1998 నుంచి ఇప్పటి వరకు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాం. లక్ష్యాలను చేరుకునేందుకు ఎంతో కష్టపడ్డాం....

Mamata Banerjee : ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాం... ఎంతో శ్రమించాం... భవిష్యత్‌లో శ్రమిస్తూనే ఉంటాం...
Follow us on

‘‘తృణమూల్‌ కాంగ్రెస్‌కు నేటితో 23 ఏళ్లు పూర్తయ్యాయి. 1998 నుంచి ఇప్పటి వరకు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాం. లక్ష్యాలను చేరుకునేందుకు ఎంతో కష్టపడ్డాం. ప్రజల కోసం భవిష్యత్‌లో శ్రమిస్తూనే ఉంటాం’’ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ట్వీట్‌ చేశారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ ఏర్పాటై 23 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆమె ట్వీట్‌ చేశారు. పార్టీనే తల్లిగా, ఆస్తిగా భావించి అహర్నిశలు పార్టీ కోసం పని చేసే కార్యకర్తలను అభినందించారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెన్నంటి నిలిచారని కొనియాడారు.

దాదాపు 25 ఏళ్లపాటు కాంగ్రెస్‌ పార్టీతో కలిసి అడుగులు వేసిన తర్వాత, కొన్ని రాజకీయ కారణాల వల్ల 1998, జనవరి 1న మమతా బెనర్జీ తృణమూల్‌ కాంగ్రెస్‌ను స్థాపించారు. అయితే పార్టీ స్థాపించిన వెంటనే తృణమూల్‌ ప్రస్థానం నల్లేరుమీద నడకలా సాగలేదు. 34 ఏళ్లపాటు అధికారంలో ఉన్న వామపక్షాలను ఓడించి.. 2011లో తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం తొలిసారిగా అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ దీదీనే విజయం వరించింది. 2021లో పశ్చిమబెంగాల్‌లో మరోసారి శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి మాత్రం తృణమూల్‌కు భాజపా ప్రధాన పోటీదారుగా నిలుస్తోంది.

 

Also Read: Taiwan: కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొన్నాం… మహమ్మారిపై విజయం సాధించాం… తైవాన్ అధ్యక్షురాలు ఇంగ్ వెన్…