మార్కెట్ పెంచుకునే పనిలో సూపర్ స్టార్ మహేశ్, తమిళ, కన్నడ ఇండస్ట్రీలపై దండయాత్ర
ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలన్న సామెతను చాలా తెలివిగా పాటిస్తున్నారు సూపర్ స్టార్ మహేశ్ బాబు. సౌత్ లో తెలుగు మినహా....
ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలన్న సామెతను చాలా తెలివిగా పాటిస్తున్నారు సూపర్ స్టార్ మహేశ్ బాబు. సౌత్ లో తెలుగు మినహా మిగతా ఇండస్ట్రీల్లో తనకు చెప్పుకోదగ్గ ఫాలోయింగ్ లేదన్న వెలితిని కొద్దికొద్దిగా పూడ్చుకుంటూ వస్తున్నారు. లేటెస్ట్ గా చందన సీమలో సత్తా చాటేశారు ఘట్టమనేని హీరో. కన్నడ టెలివిజన్ లో టెలికాస్ట్ అయిన సరిలేరు నీకెవ్వరు డబ్బింగ్ వెర్షన్.. అంచనాలకు మించి రెస్పాన్స్ రాబట్టుకుంది.
చిరూ ‘సైరా’, ప్రభాస్ ‘బాహుబలి’, బన్నీ ‘సరైనోడు’ మూవీస్ ని కూడా దాటుకుని బెటర్ టీఆర్‌పీని కొల్లగొట్టేశాడు మేజర్ అజయ్ కృష్ణ. గతంలో కన్నడ పాకెట్స్ లో మెగా హీరోలకు మాత్రమే మేజర్ పోర్షన్ ఆఫ్ ఫాలోయింగ్ ఉండేదన్న టాక్ ని తిరగరాసింది ఈ మూవీ. కాకపోతే ఈ క్రెడిట్ లో కొంత షేర్ కన్నడ బ్యూటీ రష్మిక ఖాతాలో పడొచ్చన్నది ఒక ట్విస్ట్.
ఇక అన్ లాక్ తర్వాత తమిళనాట థియేటర్లు ఓపెన్ కాగానే.. బిగ్ స్క్రీన్ అప్పియరెన్స్ ఇచ్చింది సరిలేరు నీకెవ్వరూ తమిళ్ వెర్షన్. దీపావళికి గ్రాండ్ గా 220 థియేటర్లలో విడుదలైంది. ఇళయ దళపతి విజయ్ ఫ్యాన్స్ పనిగట్టుకునిమరీ మహేశ్ మూవీని ప్రమోట్ చేశారు. ఫైనల్ గా పాజిటివ్ బజ్ తీసుకుంది ఈ మూవీ. కోలీవుడ్ లో స్పైడర్ మూవీతో మిగిలిన చేదు జ్ఞాపకాన్ని ఈ విధంగా తుడిచేసుకున్నారు సూపర్ స్టార్. సర్కారువారి పాట మూవీని పాన్ ఇండియా రేంజ్ లో మార్కెట్ చేసుకోవాలనుకున్న మహేష్ కి ఇవన్నీ శుభశకునాలే మరి.
Also Read :
లోకనాయకుడి కుమార్తెను నేనుందుకు తగ్గుతాను, భారీ రెమ్యూనరేషన్‌పై శృతి ఫోకస్