మహారాష్ట్రలో కరోనా విజృంభణ.. ఒక్కరోజే వెయ్యి దాటిన కరోనా కేసులు..

| Edited By:

May 01, 2020 | 10:04 PM

కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలన్ని లాక్ డౌన్ విధించాయి. మహారాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ రోజురోజుకూ కోవిడ్-19 పాజిటివ్ కేసులు

మహారాష్ట్రలో కరోనా విజృంభణ.. ఒక్కరోజే వెయ్యి దాటిన కరోనా కేసులు..
Follow us on

Coronavirus In Maharashtra: కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలన్ని లాక్ డౌన్ విధించాయి. మహారాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ రోజురోజుకూ కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. మహారాష్ట్రలో శుక్రవారం ఒక్కరోజులోనే 1,008 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

కాగా.. రాష్ట్రవ్యాప్తంగా కోవిద్-19 పాజిటివ్ కేసులు 11 వేల మార్క్ ను దాటి 11,506కు చేరినట్లు ప్రభుత్వం పేర్కొంది. కరోనా వల్ల ఇవాళ 26 మంది మరణించగా.. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 485 మంది మృతి చెందారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ మే 3 వరకు ఉండగా.. మే 17 వరకు పొడిగిస్తున్నట్లు శుక్రవారం కేంద్రం ప్రకటించింది.

Also Read: ఇరాక్‌లో పారామిలటరీ దళాల దాడి.. ఏడుగురు ఉగ్రవాదులు హతం..