జైల్లో అర్నాబ్ గోస్వామి ఆరోగ్యంపై ‘మహా’ గవర్నర్ ఆందోళన

రిపబ్లిక్ టీవీ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామిఫై జైల్లో దాడి జరిగిందని, తన కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు ఆయనను అనుమతించలేదని వచ్చిన వార్తలపై మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఆందోళన వ్యక్తం చేశారు.

జైల్లో అర్నాబ్ గోస్వామి ఆరోగ్యంపై మహా గవర్నర్ ఆందోళన

Edited By:

Updated on: Nov 09, 2020 | 2:14 PM

రిపబ్లిక్ టీవీ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామిఫై జైల్లో దాడి జరిగిందని, తన కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు ఆయనను అనుమతించలేదని వచ్చిన వార్తలపై మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర హోమ్ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ తో ఈ ఉదయం ఫోన్ లో మాట్లాడిన ఆయన.. అర్నాబ్ కు సెక్యూరిటీ కల్పించాలన్నారు. తన ఫ్యామిలీ మెంబర్స్ ను కలుసుకునేందుకు ఆర్నాబ్ ను అనుమతించాలన్నారు. కాగా జైల్లో గోస్వామి తన సెల్ ఫోన్ ను ఉపయోగిస్తుండగా అధికారులు చూసారని తెలిసింది.   గతవారం ఆయనను పోలీసులు అరెస్టు చేసి ఆ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నప్పటికీ అది మళ్ళీ అది ఆయనకు ఎలా అందిందో వారికీ తెలియలేదు. అటు-తలోబా జైలుకు అర్నాబ్ గోస్వామిని తరలించారు.