జీన్స్, టీషర్టులు వేసుకోవడం అక్కడ కుదరదంటే కుదరదు… సర్కార్ ఉద్యోగులకు కొత్త ఆంక్షలు..

|

Dec 12, 2020 | 6:05 AM

మహారాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. సెక్రటేరియట్‌తో పాటు ప్రభుత్వ ఆఫీసులకు హారయ్యే ఉద్యోగులు జీన్స్, టీషర్ట్ ధరించి విధులకు హాజరుకాకూడదని ఆదేశించింది. ఈ మేరకు ఈ నెల 8న డ్రెస్​ కోడ్ నిబంధనలను తెలుపుతూ ఓ సర్కులర్ జారీ చేసింది ప్రభుత్వం.

జీన్స్, టీషర్టులు వేసుకోవడం అక్కడ కుదరదంటే కుదరదు... సర్కార్ ఉద్యోగులకు కొత్త ఆంక్షలు..
Follow us on

Dress Code : మహారాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. సెక్రటేరియట్‌తో పాటు ప్రభుత్వ ఆఫీసులకు హారయ్యే ఉద్యోగులు జీన్స్, టీషర్ట్ ధరించి విధులకు హాజరుకాకూడదని ఆదేశించింది. ఈ మేరకు ఈ నెల 8న డ్రెస్​ కోడ్ నిబంధనలను తెలుపుతూ ఓ సర్కులర్ జారీ చేసింది మహా ప్రభుత్వం.

గవర్నమెంట్ ఉద్యోగులతో పాటు కాంట్రక్ట్ ఉద్యోగులకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయని తేల్చి చెప్పింది. ప్రొఫెషనల్‌గా ఉండేలా ఫార్మల్ దుస్తులు ధరించాలని కోరింది. మహిళా ఉద్యోగులు చీర, చుడీదార్, ప్యాంట్ షర్ట్‌పై చున్నీ తప్పని సరిగా వేసుకోవాలని ఆదేశించింది.

ప్రభుత్వ ఉద్యోగం.. అందులోనూ వేలల్లో జీతం.. అలాగని చెప్పి నచ్చిన దుస్తులు వేసుకెళ్తానంటే ఇకపై మహారాష్ట్రలో కుదరదంటూ హెచ్చరించింది. తాజాగా మహా సర్కార్  ఉద్యోగులకు సంబంధించి కొత్త డ్రెస్‌కోడ్‌ను తీసుకొచ్చింది. దీని ప్రకారం ఇకపై ఉద్యోగులెవరూ జీన్స్‌, టీషర్ట్‌ ధరించకూడదని డిసైడ్ చేసింది.

కొందరు ఉద్యోగులు, సిబ్బంది తాము చేస్తున్న పనికి తగ్గ దుస్తులు ధరించడం లేదని.., దీనివల్ల ప్రజల్లో ఉద్యోగుల పట్ల చులకన భావం ఏర్పడుతోందని సర్క్యులర్‌‌లో పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగుల నుంచి వ్యక్తిత్వం, మంచి ప్రవర్తనను ప్రజలు ఆశిస్తారని తెలిపింది. ఉద్యోగులు అనువుకాని, శుభ్రతలేని దుస్తులు ధరించడం వల్ల దాని ప్రభావం పనిపైనా ప్రభావం చూపుతోందని అందులో అభిప్రాయపడింది.

అందుకే పరిశుభ్రమైన, యోగ్యమైన వేషధారణలో కనిపించాల్సి ఉంటుందని సర్క్యులర్‌ పేర్కొంది. మహిళా ఉద్యోగులైతే చీరలు, సల్వార్‌.. చుడిదార్స్‌ కుర్తాస్‌, ట్రౌజర్‌ ప్యాంట్స్‌ ధరించొచ్చని పేర్కొంది. పురుష ఉద్యోగులు మాత్రం షర్ట్‌, ప్యాంట్స్‌ ధరించాలంది. వేసుకునే చెప్పులు సైతం హుందాగా ఉండాలని సూచించింది.

బొమ్మలు, ఎంబ్రాయిడరీ వర్క్స్‌ ఉన్నవి, మరీ ముదురు రంగు ఉన్న చొక్కాలు కూడా ధరించరాదని.. మరీ ముఖ్యంగా జీన్స్‌, టీషర్ట్‌కు దూరంగా ఉండాలని పేర్కొంది. అలాగే చేనేతను ప్రోత్సహించేందుకు వారంలో ఒకరోజు ఖాదీ దుస్తులు ధరించాలని సర్క్యులర్‌ జారీ చేసింది.