నిబంధనలు పాటించకుంటే మళ్లీ లాక్‌డౌన్ : సీఎం హెచ్చరిక

|

Jun 11, 2020 | 10:08 PM

రాష్ట్రంలో లాకడౌన్‌ను దశలవారీగా విధించడంతోపాటు దశలవారీగా ఎత్తివేస్తున్నామని వివ‌రించారు. ప్రమాదం ఇంకా తీవ్రస్థాయిలోనే ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనాతో పోరాడుతూ ఆర్థిక వ్యవస్థనూ గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం స్ప‌స్టం చేశారు.

నిబంధనలు పాటించకుంటే మళ్లీ లాక్‌డౌన్ : సీఎం హెచ్చరిక
Follow us on

రాష్ట్రంలో కరోనా నిబంధనలు పాటించకుంటే తిరిగి లాకడౌన్‌ను విధించాల్సి వస్తుందని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ప్రజలను హెచ్చరించారు. కరోనా మహమ్మారి ఉద్ధృతిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టిందన్నారు. సడలింపులు ముప్పుగా మారాయని తేలితే మరోసారి లాకడౌన్‌ విధిస్తామని స్పష్టం చేశారు. ప్రజలంతా పరిస్థితిని గమనించి, సామాజిక దూరం పాటించాలని ఆయన ట్విట్టర్‌ ద్వారా విజ్ఞప్తి చేశారు.

అతలాకుతలం:
రాష్ట్రంలో లాకడౌన్‌ను దశలవారీగా విధించడంతోపాటు దశలవారీగా ఎత్తివేస్తున్నామని ఠాక్రే వివ‌రించారు. ప్రమాదం ఇంకా తీవ్రస్థాయిలోనే ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనాతో పోరాడుతూ ఆర్థిక వ్యవస్థనూ గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం స్ప‌స్టం చేశారు. ఇదిలా ఉండగా నిసర్గ తుఫాన్‌ కూడా రాష్టాన్ని అతలాకుతలం చేసిందన్నారు. విద్యుత్‌ వ్యవస్థ దెబ్బతిన్నదని, భారీ సంఖ్యలో సాంకేతిక నిపుణులను ఉపయోగించి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

ఆల్ టైమ్ రికార్డ్:
క‌రోనా మ‌హ‌మ్మారి కోర‌ల్లో చిక్కుకుని మ‌హారాష్ట్ర చిగురుటాకుల వ‌ణికిపోతోంది. మ‌హారాష్ట్ర‌లో గురువారం కూడా భారీగా కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా 3,607 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. 1561 మంది రోగులు డిశ్చార్జి కాగా.. మరో 152 మంది మరణించారు. తాజా కేసులతో కలిపి మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 97,648కి చేరింది. కరోనా మహమ్మారితో పోరాడుతూ ఇప్పటి వరకు 46,078 మంది కోలుకోగా..3590 మంది మరణించారు. ప్రస్తుతం మహారాష్ట్రలో 47,968 యాక్టిక్ కరోనా కేసులున్నాయి.