క్షీణించిన మధ్యప్రదేశ్ గవర్నర్ ఆరోగ్యం..

Madhya Pradesh Governor Still Critical  : మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ ఆరోగ్య పరిస్థితి మరోసారి క్షీణించింది. ఆయన శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతుండటంతో కుటుంబ సభ్యులు లక్నోలని మెదంటా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందిస్తున్న ఆయనకు వైద్యులు వెంటిలేటర్‌ ద్వారా శ్వాసను అందిస్తున్నారు. ఊపిరితిత్తులు, మూత్రపిండాలతో పాటు కాలేయం పాడైపోవడంతో ఆయన పరిస్థితి విషమంగా మారింది. గవర్నర్ లాల్జీ టాండన్ ఆరోగ్యం క్లిష్టంగా ఉందని.. తను వెంటిలేటర్ ద్వారా శ్వాస తీసుకుంటున్నారని […]

క్షీణించిన మధ్యప్రదేశ్ గవర్నర్ ఆరోగ్యం..

Edited By:

Updated on: Jul 16, 2020 | 6:58 PM

Madhya Pradesh Governor Still Critical  : మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ ఆరోగ్య పరిస్థితి మరోసారి క్షీణించింది. ఆయన శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతుండటంతో కుటుంబ సభ్యులు లక్నోలని మెదంటా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందిస్తున్న ఆయనకు వైద్యులు వెంటిలేటర్‌ ద్వారా శ్వాసను అందిస్తున్నారు. ఊపిరితిత్తులు, మూత్రపిండాలతో పాటు కాలేయం పాడైపోవడంతో ఆయన పరిస్థితి విషమంగా మారింది.

గవర్నర్ లాల్జీ టాండన్ ఆరోగ్యం క్లిష్టంగా ఉందని.. తను వెంటిలేటర్ ద్వారా శ్వాస తీసుకుంటున్నారని మెదాంత లక్నో డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ కపూర్ తెలిపారు. క్రిటికల్ కేర్ మెడిసిన్ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు.