పవన్​ కల్యాణ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ మృతి.. పాడె మోసిన మంత్రి, మాజీ మంత్రి

|

Feb 04, 2020 | 8:22 AM

రాజకీయం ఎప్పుడూ శత్రువులను తయారు చేస్తుంది. మానవత్వం మనుషులు దగ్గర చేస్తోంది. ఇప్పుడు అటువంటి సంఘటననే  కృష్ణా జిల్లా మచిలీపట్నంలో చోటుచేసుకుంది. బందరు పవర్‌స్టార్ పవన్​కల్యాణ్ ఫ్యాన్స్ అధ్యక్షుడు దాసరి లక్ష్మణ రావు(బుడ్డా) హఠాత్తుగా హార్ట్ అటాక్‌తో మృతి చెందారు. లక్ష్మణరావుకు అత్యంత సన్నిహితుడు అయిన సుధా ఫోటో స్టూడియో ఓనర్ సుధాకర్ రీసెంట్‌గా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆయన మరణవార్తతో కలత చెందిన..లక్ష్మణరావు కొన్ని రోజులుగా ముభావంగా ఉంటున్నారు. ఈ క్రమంలోని ఆయనకు గుండెపోటు […]

పవన్​ కల్యాణ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ మృతి.. పాడె మోసిన మంత్రి, మాజీ మంత్రి
Follow us on

రాజకీయం ఎప్పుడూ శత్రువులను తయారు చేస్తుంది. మానవత్వం మనుషులు దగ్గర చేస్తోంది. ఇప్పుడు అటువంటి సంఘటననే  కృష్ణా జిల్లా మచిలీపట్నంలో చోటుచేసుకుంది. బందరు పవర్‌స్టార్ పవన్​కల్యాణ్ ఫ్యాన్స్ అధ్యక్షుడు దాసరి లక్ష్మణ రావు(బుడ్డా) హఠాత్తుగా హార్ట్ అటాక్‌తో మృతి చెందారు.

లక్ష్మణరావుకు అత్యంత సన్నిహితుడు అయిన సుధా ఫోటో స్టూడియో ఓనర్ సుధాకర్ రీసెంట్‌గా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆయన మరణవార్తతో కలత చెందిన..లక్ష్మణరావు కొన్ని రోజులుగా ముభావంగా ఉంటున్నారు. ఈ క్రమంలోని ఆయనకు గుండెపోటు వచ్చిందని ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు. వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించి..వైద్య చికిత్స అందించినప్పటికి బ్రతికించుకోలేకపోయారు. ఈ శనివారం ఆయన అంతిమయాత్ర నిర్వహించారు. ఏపీ మంత్రి పేర్ని నాని, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర లక్ష్మణరావు పాడె మోశారు. జిల్లాకు చెందిన పలువురు ప్రముఖులు లక్ష్మణరావు భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.