Lunch Meeting: టీడీపీలో లంచ్ మీటింగ్ లొల్లి.. బాబు స్కెచ్ అదే

ఆదివారం (మార్చి 1న) లంచ్‌ మీటింగ్‌ జరిగింది. సమావేశం జరిగి మూడు రోజులైంది. కానీ ఆ మీటింగ్‌ ప్రకంపనలు ఆ పార్టీలో ఇంకా కొనసాగుతున్నాయి. వాళ్లనే ఎందుకు పిలిచారు? ఏం మేసేజ్ ఇవ్వాలనుకున్నారు. ఈ మీటింగ్‌తో పార్టీకి లాభమా? నష్టమా?

Lunch Meeting: టీడీపీలో లంచ్ మీటింగ్ లొల్లి.. బాబు స్కెచ్ అదే

Updated on: Mar 04, 2020 | 7:22 PM

Reason behind Nara Lokesh lunch meeting: ఆదివారం (మార్చి 1న) లంచ్‌ మీటింగ్‌ జరిగింది. సమావేశం జరిగి మూడు రోజులైంది. కానీ ఆ మీటింగ్‌ ప్రకంపనలు ఆ పార్టీలో ఇంకా కొనసాగుతున్నాయి. వాళ్లనే ఎందుకు పిలిచారు? ఏం మేసేజ్ ఇవ్వాలనుకున్నారు. ఈ మీటింగ్‌తో పార్టీకి లాభమా? నష్టమా? అని కార్యకర్తలు ఆలోచిస్తున్నారట. అటు అధినేత స్కెచ్‌ మాత్రం వేరుగా ఉందట.

ఇటు నియోజకవర్గ పర్యటనలు.. అటు వీకెండ్‌ మీటింగ్‌లు.. ఇప్పుడు టీడీపీలో హాట్‌ టాపిక్‌. హైదరాబాద్‌లో ఆదివారం టీడీపీ యువనేతలకు లోకేష్‌, బ్రాహ్మణి విందు ఇచ్చారు. తమ సొంత నివాసంలో ఈ లంచ్ మీటింగ్‌ జరిగింది. ఈ లంచ్‌ మీటింగ్‌కు పరిటాల, మాగంటి, దేవినేని, కరణం, బొజ్జల, దేవినేని, ఎర్రన్నాయుడు, అయ్యన్న పాత్రుడు కుటుంబాల వారసులతోపాటు పలువురు యువ నేతలు హాజరయ్యారు. లోకల్‌ ఎలక్షన్స్‌ ముందు ఈ మీటింగ్‌ ఎందుకు పెట్టారు? అనే దానిపై పార్టీలో తీవ్ర చర్చ నడుస్తోంది.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత టీడీపీలో కొంత స్తబ్దత ఏర్పడింది. ఏడాదిగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా నేతలు పూర్తి స్థాయిలో కదలడం లేదు, పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం లేదు. పార్టీ పునర్‌ వైభవం సాధిస్తుందా? చంద్రబాబు తర్వాత పార్టీని నడిపించే నేత ఎవరు? ఇలా పార్టీలో వివిధ రకాలుగా చర్చ జరుగుతోంది.

పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా చంద్రబాబు ముందుండి నడిపించాల్సి వస్తోంది. చంద్రబాబు తర్వాత నాయకుడెవరు అనే ప్రశ్నకు కొందరికి సమాధానం దొరకడం లేదట. చంద్రబాబు తర్వాత లోకేష్‌ నాయకత్వాన్ని సమర్ధించేందుకు కొందరు నేతలు రెడీగా లేరట. దీంతో పార్టీలో ఇలాంటి అంశాలకు చెక్‌ పెట్టేందుకు వారసుల లంచ్‌ మీటింగ్‌ పెట్టారట. లోకేష్‌ నాయకత్వంపై వస్తున్న అనుమానాలు, సందేహాలకు కౌంటర్‌గా ఈ మీటింగ్‌ ఏర్పాటు చేశారని పార్టీలో గుసగుసలు నడుస్తున్నాయి.

చంద్రబాబు వ్యూహం మేరకే ఈ సమావేశం జరిగిందని చర్చ నడుస్తోంది. లోకేష్ వెంట నడిస్తే పార్టీ యువనేతలకు భవిష్యత్‌లో మంచి భవిష్యత్‌ భరోసా ఉంటుందని చెప్పారట. లోకేష్‌ వెంట వీళ్లంతా కలిసి పార్టీని ముందుకు నడిపిస్తారనే సంకేతం ఈ మీటింగ్‌ ద్వారా పంపించారట. లోకేష్‌ను తక్కువ చేసి చూపుతున్న, మాట్లాడుతున్న నేతలకు ఈ మీటింగ్‌ ఓ సిగ్నల్‌గా చంద్రబాబు పంపించారని అంటున్నారు. లోకేష్‌ను ప్రమోట్‌ చేయడం కోసం యువనేతల్ని కూడగట్టి ఈ మీటింగ్‌ పెట్టారని పార్టీలో ప్రచారం జరుగుతోంది.

ఈ సమావేశంపై పార్టీ కార్యకర్తలు కూడా తీవ్రంగా స్పందించారు. ఈ నేతలు పార్టీకి టచ్‌లో లేరని…వీరితో పార్టీకి పైసా లాభం లేదని కొందరు తీవ్ర విమర్శలు చేశారు. మొత్తానికి వీకెండ్‌ లంచ్‌ మీటింగ్‌ టీడీపీలో హాట్‌ టాపిక్‌గా మారింది.

ఇదీ చదవండి: జగన్‌పై జేసీ సంచలన కామెంట్ JC sensational comment on YS Jagan