వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరకు రెక్కలు.. రూ.225 పెంపు

LPG Gas Cylinder Prices Increase: ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో సతమతమవుతున్న ప్రజలకు మరో షాక్ తగిలింది. తాజాగా వంట గ్యాస్ ధరలు మరోసారి పెరిగాయి. ఎల్‌పీజీ సిలిండర్ కొత్తగా పెరిగిన ధరలు శనివారం నుంచి అమలులోకి వచ్చాయి. అయితే ఇది అందరికీ వర్తించదు. కేవలం హోటల్స్ లాంటి కమర్షియల్ అవసరాలకు వాడే 19 కేజీల సిలిండర్(కమర్షియల్ సిలిండర్) ధరలు మాత్రమే ఆకాశాన్ని తాకుతున్నాయి. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్‌ ధర సుమారు రూ.225 మేరకు […]

వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరకు రెక్కలు.. రూ.225 పెంపు

Updated on: Feb 02, 2020 | 1:37 PM

LPG Gas Cylinder Prices Increase: ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో సతమతమవుతున్న ప్రజలకు మరో షాక్ తగిలింది. తాజాగా వంట గ్యాస్ ధరలు మరోసారి పెరిగాయి. ఎల్‌పీజీ సిలిండర్ కొత్తగా పెరిగిన ధరలు శనివారం నుంచి అమలులోకి వచ్చాయి. అయితే ఇది అందరికీ వర్తించదు. కేవలం హోటల్స్ లాంటి కమర్షియల్ అవసరాలకు వాడే 19 కేజీల సిలిండర్(కమర్షియల్ సిలిండర్) ధరలు మాత్రమే ఆకాశాన్ని తాకుతున్నాయి.

కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్‌ ధర సుమారు రూ.225 మేరకు పెరిగింది. ప్రస్తుతం ఈ గ్యాస్ ధర రూ.1336.50గా ఉంది. బడ్జెట్‌ వేళ గ్యాస్ సిలిండర్ ధర ఈ స్థాయిలో పెరగడం గమనార్హం. తాజా పెంపుతో కమర్షియల్‌ సిలిండర్‌ ధర రూ.1,550కి చేరుకుంది. గతంలో ఈ అయితే రిటైల్ ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు మాత్రం కాస్త ఊరట లభించింది. గత ఐదు నెలలుగా పెరుగుతూ వస్తున్న గృహ అవసరాలకు వాడే 14.2 కేజీల సిలిండర్ రేట్లు ప్రస్తుతానికి యధాతధంగానే ఉన్నాయి. అటు కేంద్రం సగటు వినియోగదారుడికి సంవత్సరానికి 12 సిలిండర్లు సబ్సిడీ మీద ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇక వాణిజ్య అవసరాల కోసం వినియోగించుకునే కమర్షియల్ సిలిండర్ ధర పెంపుతో ట్రేడర్లకు ఇబ్బందులు తప్పవనే చెప్పాలి.